Last Updated:
ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక చర్చ జరిగినట్లు సమాచారం.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వెలుపల పార్టీ నిరసనకు నాయకత్వం వహిస్తున్న సమయంలో, కేంద్ర విజ్ఞాన, సాంకేతిక శాఖతో పాటు భూ విజ్ఞాన శాఖ స్వతంత్ర బాధ్యతల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు రాహుల్ గాంధీతో మాట్లాడారు. అయితే ఈ చర్చ అనంతరం మరో డిమాండ్ రాహుల్ చేయడంతో కథ మళ్లీ మెుదటికి వచ్చింది. అసలు రాహుల్ మెుదట ఏం కావాలని డిమాంట్ చేశాడు? తర్వాత ఇంకా ఏ డిమాండ్‌పై పట్టుబడుతున్నాడు? ….
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వం ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉందని తెలిపారు. “పార్లమెంట్ సజావుగా సాగాలి. శాంతిభద్రతల సమస్య తలెత్తే పరిస్థితులు సృష్టించకూడదు. ఇది అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడ దీర్ఘకాలిక నిరసనలు కొనసాగితే భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంది” అని ఆయన చెప్పినట్లు సమాచారం. దీనిపై రాహుల్ అంగీకరించారని కేంద్ర మంత్రి తెలిపారు.
అయితే తాజాగా రాహుల్ మరో రాగం వినిపిస్తున్నారని కేంద్ర మంత్రి జితేందర్ తెలిపారు. ఆయన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర సీనియర్ నేతలు అక్బర్ రోడ్ సమీపంలో ఆకస్మిక ధర్నా చేపట్టిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ చర్చలు జరిపినట్లు వెల్లడించారు. నిరసన విరమించాలని కోరగా, నీట్ (NEET) అంశం మరియు సంబంధిత ఉద్యమంపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తే ధర్నా ముగిస్తానని రాహుల్ గాంధీ చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధమని హామీ ఇచ్చిన తర్వాత, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కూడా తన కొత్త డిమాండ్ అని రాహుల్ పేర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ఇప్పటివరకు నిబంధనల ప్రకారం అధికారిక చర్చకు నోటీసు ఇవ్వలేదని, రాహుల్ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని జితేంద్ర సింగ్ విమర్శించారు.
कुछ समय पहले, यह ज्ञात हुआ कि कांग्रेस पार्टी के राष्ट्रीय अध्यक्ष, श्री मल्लिकार्जुन खड़गे और उनके साथ अन्य वरिष्ठ नेता, जैसे कि श्री राहुल गांधी, श्रीमती प्रियंका गांधी इत्यादि अकस्मात ही अकबर रोड़ के समीप एक स्थान पर अपने समर्थकों के साथ धरने पर बैठ गयेहैं। सरकार ने इस वरिष्ठ…
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 21, 2026
ఇంతకుముందు ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పార్లమెంట్ ముట్టడికి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఒక రోజు ముందు పోలీసులు తీసుకున్న చర్యలకు నిరసనగా కాంగ్రెస్ ఈ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా పంజాబ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ చరణ్‌జిత్ సింగ్ చన్నీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
అంతకుముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కే.సి. వేణుగోపాల్‌లు ఢిల్లీలో పోలీసుల చర్యల్లో గాయపడిన విద్యార్థి నిరసనకారులను కలిసి పరామర్శించారు. దేశ యువతపై జరిగిన “క్రూరమైన” చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రామ్ మనోహర్ లోహియా (RML) ఆస్పత్రికి వెళ్లి గాయపడిన నిరసనకారులను పరామర్శించారు.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ సోమవారం జేపీ నడ్డా ముందు మూడు ప్రధాన డిమాండ్లు ఉంచారు. అందులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana

