మహిళలపై కూడా గ్యాంగ్ రేప్ కేసులు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. నేరంలో సహకరిస్తే కఠిన శిక్ష తప్పదు! |


Last Updated:

సామూహిక అత్యాచార కేసుల్లో మహిళలు నేరుగా దాడిలో పాల్గొనకపోయినా, నేరానికి సహకరించినా గ్యాంగ్ రేప్ అభియోగాలు మోపవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఉద్దేశంతో సాయం చేసినా నేరమేనని తేల్చింది.

News18
News18

సామూహిక అత్యాచార ఘటనల్లో మహిళలు స్వయంగా శారీరకంగా ఆ దాడికి పాల్పడలేకపోయినా, వారిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 376డీ కింద గ్యాంగ్ రేప్ అభియోగాలు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ ధర్మాసనం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. భారతీయ చట్టాల్లో అత్యాచారం నేరం పురుషులకు మాత్రమే వర్తిస్తుందని, శరీర నిర్మాణ పరంగా స్త్రీలు ఆ చర్య చేయలేరు కాబట్టి మహిళపై గ్యాంగ్ రేప్ సెక్షన్ పెట్టడం చెల్లదంటూ దాఖలైన పిటిషన్ వాదనను న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది.

సామూహిక నేరాల్లో శారీరక చర్య కంటే కూడా నేరం చేయాలనే ఉమ్మడి ఉద్దేశం, ఆ దారుణానికి పూర్తి సహకారం అందించడమే ప్రధానమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ తీర్పు ద్వారా సామూహిక లైంగిక నేరాల్లో మహిళా నిందితుల పాత్రపై ఎప్పటినుంచో ఉన్న చట్టపరమైన సందిగ్ధతకు తెరపడింది.

ఉమ్మడి ఉద్దేశం ఉంటే సమాన బాధ్యత

సామూహిక అత్యాచారం కేసుల్లో ఐపీసీ సెక్షన్ 376డీ ప్రకారం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే ఉమ్మడి ఉద్దేశంతో పనిచేసినప్పుడు ఆ సెక్షన్ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. నేరం చేయడానికి దారితీసే పరిస్థితులను సృష్టించినా, బాధితురాలిని పట్టుకుని బంధించినా, నేరం జరిగే చోట కాపలా కాసినా లేదా బాధితురాలిని మాయమాటలతో ఘటనా స్థలానికి రప్పించినా ఆ వ్యక్తిని ప్రధాన నేరంలో సమాన భాగస్వామిగానే పరిగణిస్తారు. మహిళలైనా సరే ఇలాంటి సహకారం అందించినప్పుడు నేరంలో ప్రత్యక్ష పాత్రధారిగానే చూస్తారు.

చట్టపరమైన లొసుగులకు చెక్

గతంలో సామూహిక నేరాల్లో సహాయకులుగా ఉన్న మహిళలపై కేవలం నేరపూరిత కుట్ర, నేరానికి పురికొల్పడం వంటి తక్కువ తీవ్రత గల సెక్షన్ల కింద మాత్రమే విచారణ జరిగేది. తాజా తీర్పు ద్వారా అలాంటి చట్టపరమైన లొసుగులకు అవకాశం లేకుండా పోయింది. ఒక సామూహిక నేరాన్ని ప్లాన్ చేసి అమలు చేసినప్పుడు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై ఉమ్మడి క్రిమినల్ బాధ్యత ఉంటుందని న్యాయస్థానం పునరుద్ఘాటించింది. శరీర నిర్మాణ కారణాలను అడ్డం పెట్టుకుని మహిళలు చట్టం నుంచి తప్పించుకోలేరని కోర్టు తేల్చింది.

దేశవ్యాప్తంగా సామూహిక నేరాల విచారణలో ఈ తీర్పు ఒక బలమైన మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధాన అత్యాచారం నేరం పురుషులకు వర్తించినప్పటికీ, గ్యాంగ్ రేప్ చట్టాలు ఉమ్మడి కుట్ర, సామూహిక దాడి ఆధారంగా పనిచేస్తాయని స్పష్టమైంది. ఘోరమైన దాడులకు సహకరించే నిందితులు ఎంతటి వారైనా సమాన తీవ్రతతో కూడిన శిక్షలను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు హెచ్చరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 11:11 pm Digital Edition : Prabhanews
మహిళలపై కూడా గ్యాంగ్ రేప్ కేసులు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. నేరంలో సహకరిస్తే కఠిన శిక్ష తప్పదు! |

Last Updated:Oct 15, 2026 10:53 PM ISTసామూహిక అత్యాచార కేసుల్లో మహిళలు నేరుగా దాడిలో పాల్గొనకపోయినా, నేరానికి సహకరించినా గ్యాంగ్ రేప్ అభియోగాలు మోపవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఉద్దేశంతో సాయం చేసినా నేరమేనని తేల్చింది.News18సామూహిక అత్యాచార ఘటనల్లో మహిళలు స్వయంగా శారీరకంగా ఆ దాడికి పాల్పడలేకపోయినా, వారిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 376డీ కింద గ్యాంగ్ రేప్ అభియోగాలు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ ధర్మాసనం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. భారతీయ చట్టాల్లో అత్యాచారం నేరం పురుషులకు మాత్రమే వర్తిస్తుందని, శరీర నిర్మాణ పరంగా స్త్రీలు ఆ చర్య చేయలేరు కాబట్టి మహిళపై గ్యాంగ్ రేప్ సెక్షన్ పెట్టడం చెల్లదంటూ దాఖలైన పిటిషన్ వాదనను న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది.సామూహిక నేరాల్లో శారీరక చర్య కంటే కూడా నేరం చేయాలనే ఉమ్మడి ఉద్దేశం, ఆ దారుణానికి పూర్తి సహకారం అందించడమే ప్రధానమని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ తీర్పు ద్వారా సామూహిక లైంగిక నేరాల్లో మహిళా నిందితుల పాత్రపై ఎప్పటినుంచో ఉన్న చట్టపరమైన సందిగ్ధతకు తెరపడింది.ఉమ్మడి ఉద్దేశం ఉంటే సమాన బాధ్యతసామూహిక అత్యాచారం కేసుల్లో ఐపీసీ సెక్షన్ 376డీ ప్రకారం ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే ఉమ్మడి ఉద్దేశంతో పనిచేసినప్పుడు ఆ సెక్షన్ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. నేరం చేయడానికి దారితీసే పరిస్థితులను సృష్టించినా, బాధితురాలిని పట్టుకుని బంధించినా, నేరం జరిగే చోట కాపలా కాసినా లేదా బాధితురాలిని మాయమాటలతో ఘటనా స్థలానికి రప్పించినా ఆ వ్యక్తిని ప్రధాన నేరంలో సమాన భాగస్వామిగానే పరిగణిస్తారు. మహిళలైనా సరే ఇలాంటి సహకారం అందించినప్పుడు నేరంలో ప్రత్యక్ష పాత్రధారిగానే చూస్తారు.చట్టపరమైన లొసుగులకు చెక్గతంలో సామూహిక నేరాల్లో సహాయకులుగా ఉన్న మహిళలపై కేవలం నేరపూరిత కుట్ర, నేరానికి పురికొల్పడం వంటి తక్కువ తీవ్రత గల సెక్షన్ల కింద మాత్రమే విచారణ జరిగేది. తాజా తీర్పు ద్వారా అలాంటి చట్టపరమైన లొసుగులకు అవకాశం లేకుండా పోయింది. ఒక సామూహిక నేరాన్ని ప్లాన్ చేసి అమలు చేసినప్పుడు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై ఉమ్మడి క్రిమినల్ బాధ్యత ఉంటుందని న్యాయస్థానం పునరుద్ఘాటించింది. శరీర నిర్మాణ కారణాలను అడ్డం పెట్టుకుని మహిళలు చట్టం నుంచి తప్పించుకోలేరని కోర్టు తేల్చింది.దేశవ్యాప్తంగా సామూహిక నేరాల విచారణలో ఈ తీర్పు ఒక బలమైన మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రధాన అత్యాచారం నేరం పురుషులకు వర్తించినప్పటికీ, గ్యాంగ్ రేప్ చట్టాలు ఉమ్మడి కుట్ర, సామూహిక దాడి ఆధారంగా పనిచేస్తాయని స్పష్టమైంది. ఘోరమైన దాడులకు సహకరించే నిందితులు ఎంతటి వారైనా సమాన తీవ్రతతో కూడిన శిక్షలను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు హెచ్చరించింది.మరింత చదవండి

Source link