ప్రభన్యూస్

‘నా చావుకు అతడే కారణం’.. మంచిర్యాల యువతి మృతి కేసులో కీలక మలుపు! | తెలంగాణ వార్తలు


Last Updated:

మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన బీ ఫార్మసీ చదివిన యువతి గోషిక మాధవి (26) ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

News18
News18

మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన బీ ఫార్మసీ చదివిన యువతి గోషిక మాధవి (26) ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆత్మహత్యకు ముందు ఆమె రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో తన మరణానికి ఓ వ్యక్తే కారణమని పేర్కొనడం కేసును మరింత సంచలనంగా మార్చింది.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. టేకుమట్ల గ్రామానికి చెందిన గోషిక రాజేష్, బానిస దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న ఈ కుటుంబంలో నాలుగో కుమార్తె మాధవి. ఆమె బీ ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన గోనె వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగి గత రెండేళ్లుగా మాధవిని ప్రేమిస్తున్నానని చెబుతూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మాధవి పలుమార్లు నిరాకరించినప్పటికీ వెంకటేష్ తన ప్రవర్తన మార్చుకోలేదని, తరచూ వేధింపులకు పాల్పడేవాడని బంధువులు చెబుతున్నారు. అంతేకాకుండా వెంకటేష్ తల్లి శంకరమ్మ, అతని చెల్లెలు కూడా మాధవిపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. అయినప్పటికీ వెంకటేష్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

వేధింపులు కొనసాగుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధవి చివరకు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో మరో కీలక అంశం సూసైడ్ నోట్. ఆత్మహత్యకు ముందు మాధవి రాసినట్లు చెబుతున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో తనను ప్రేమ పేరుతో వేధించిన వెంకటేష్ కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, తన మరణానికి అతడే బాధ్యుడని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తనపై ఎలాంటి నిందలు వేయవద్దని, తన బలవన్మరణానికి కారణమైన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆ లేఖలో రాసినట్లు వెల్లడించారు.

మాధవి మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి తమ కుమార్తెకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు, లభ్యమైన ఆధారాలు, సూసైడ్ నోట్‌ను పరిగణనలోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో వెంకటేష్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైపూర్ ఎస్సై భూమేష్ తెలిపారు.

ప్రేమ పేరుతో వేధింపులు, మానసిక ఒత్తిళ్లు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే కేసుకు సంబంధించిన పూర్తి నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 July 2026, 8:40 am Digital Edition : Prabhanews
‘నా చావుకు అతడే కారణం’.. మంచిర్యాల యువతి మృతి కేసులో కీలక మలుపు! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 14, 2026 8:38 AM ISTమంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన బీ ఫార్మసీ చదివిన యువతి గోషిక మాధవి (26) ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.News18మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన బీ ఫార్మసీ చదివిన యువతి గోషిక మాధవి (26) ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే ఆత్మహత్యకు ముందు ఆమె రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో తన మరణానికి ఓ వ్యక్తే కారణమని పేర్కొనడం కేసును మరింత సంచలనంగా మార్చింది.పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. టేకుమట్ల గ్రామానికి చెందిన గోషిక రాజేష్, బానిస దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న ఈ కుటుంబంలో నాలుగో కుమార్తె మాధవి. ఆమె బీ ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అదే గ్రామానికి చెందిన గోనె వెంకటేష్ అనే సింగరేణి ఉద్యోగి గత రెండేళ్లుగా మాధవిని ప్రేమిస్తున్నానని చెబుతూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.మాధవి పలుమార్లు నిరాకరించినప్పటికీ వెంకటేష్ తన ప్రవర్తన మార్చుకోలేదని, తరచూ వేధింపులకు పాల్పడేవాడని బంధువులు చెబుతున్నారు. అంతేకాకుండా వెంకటేష్ తల్లి శంకరమ్మ, అతని చెల్లెలు కూడా మాధవిపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం గ్రామంలో చర్చనీయాంశంగా మారడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారు. అయినప్పటికీ వెంకటేష్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.వేధింపులు కొనసాగుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాధవి చివరకు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనలో మరో కీలక అంశం సూసైడ్ నోట్. ఆత్మహత్యకు ముందు మాధవి రాసినట్లు చెబుతున్న లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో తనను ప్రేమ పేరుతో వేధించిన వెంకటేష్ కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, తన మరణానికి అతడే బాధ్యుడని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తనపై ఎలాంటి నిందలు వేయవద్దని, తన బలవన్మరణానికి కారణమైన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆ లేఖలో రాసినట్లు వెల్లడించారు.మాధవి మృతితో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి తమ కుమార్తెకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు, లభ్యమైన ఆధారాలు, సూసైడ్ నోట్‌ను పరిగణనలోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో వెంకటేష్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైపూర్ ఎస్సై భూమేష్ తెలిపారు.ప్రేమ పేరుతో వేధింపులు, మానసిక ఒత్తిళ్లు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే కేసుకు సంబంధించిన పూర్తి నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link