ప్రభన్యూస్

తండ్రి మాదాల రంగారావు బాటలో పీపుల్స్ డాక్టర్ మాదాల రవి.. సినీ, సామాజిక సేవలో ముందడుగు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడైన డాక్టర్ మాదాల రవి, వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ‘మా’ సభ్యుల సంక్షేమానికి మద్దతునిస్తూనే ఉన్నారు. తండ్రి మాదాల రంగారావు బాటలో పీపుల్స్ డాక్టర్ అనిపించుకుంటున్నారు.

News18
News18

మాదాల రంగారావు తీసిన ‘ఎర్రమల్లెలు’ చిత్రంతో బాల నటుడిగా పరిచయమయ్యారు మాదాల రవి. ఆ చిత్రంలోని “నాంపల్లి స్టేషన్ కాడి’ అనే పాట ఇప్పటికీ చార్ట్ బస్టర్‌గానే నిలుస్తోంది. ఆయన రష్యాలో ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎండీ, గ్యాస్ట్రోఎంటరాలజీలో డీఎం పూర్తి చేశారు. అలాగే ఒక ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన రష్యాలో భారతీయ సంస్థలకు, సాంస్కృతిక వ్యవహారాల విభాగానికి సాంస్కృతిక కార్యదర్శిగా కూడా సేవలందించారు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి ‘నేను సైతం’, ‘మా ఇలవేల్పు’, ‘బ్రోకర్ 2’, ‘పంచముఖి’, ‘వీరగాధ’, ‘ఆజ్ కా ఇంక్విలాబ్’, ‘నాగ్ లక్ష్మి’ వంటి అనేక చిత్రాలలో కథానాయకుడిగా నటించి, నిర్మించారు. ఆయన నటుడిగా, చిత్రనిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎం.డి, గ్యాస్ట్రోఎంటరాలజీలో డి.ఎం వంటి ప్రత్యేక వైద్య అర్హతలు కలిగిన డాక్టర్ మాదాల రవి గారి నిజమైన వైద్య సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వైద్యాన్ని వ్యాపారంగా చూడని ఆయన తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తృత వైద్య శిబిరాలను నిర్వహించి పేదలకు సేవ చేశారు. ఆయన అందించే సేవల్లో ప్రధానంగా శ్రామిక కుటుంబాలు, రోజువారీ కూలీలు, ప్రత్యేక జీర్ణాశయ సంబంధిత వ్యాది గ్రస్తులు, నిరుపేద వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. నిస్వార్థంగా వైద్య సేవల అందించడం ద్వారా ఆయన పీపుల్స్ డాక్టర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ప్రజా నాట్య మండలి, సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీల నాయకుడిగా, ఆయన అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, వాటిలో పాల్గొన్నారు. సామాజిక దురాగతాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి కళే అత్యంత శక్తివంతమైన సాధనమని ఆయన గట్టిగా నమ్ముతారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడైన డాక్టర్ మాదాల రవి, వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ‘మా’ సభ్యుల సంక్షేమానికి మద్దతునిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా, చిత్ర పరిశ్రమ, నిరుపేద కార్మికుల కోసం ఉద్దేశించిన అన్ని సంక్షేమ పథకాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.

నటుడిగా, చిత్రనిర్మాతగా సాధించిన విజయాలకు అతీతంగా, సామాజిక కార్యకర్తగా, ప్రజల వైద్యుడిగా, నటుడిగా ఆయన చేసిన అవిశ్రాంత కృషికి గాను ఆయన్ను ఎన్నో పురస్కారాలు లభించాయి. అలాంటి డా. మాదాల రవి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 8:17 pm Digital Edition : Prabhanews
తండ్రి మాదాల రంగారావు బాటలో పీపుల్స్ డాక్టర్ మాదాల రవి.. సినీ, సామాజిక సేవలో ముందడుగు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 8:12 PM ISTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడైన డాక్టర్ మాదాల రవి, వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ‘మా’ సభ్యుల సంక్షేమానికి మద్దతునిస్తూనే ఉన్నారు. తండ్రి మాదాల రంగారావు బాటలో పీపుల్స్ డాక్టర్ అనిపించుకుంటున్నారు. News18మాదాల రంగారావు తీసిన ‘ఎర్రమల్లెలు’ చిత్రంతో బాల నటుడిగా పరిచయమయ్యారు మాదాల రవి. ఆ చిత్రంలోని "నాంపల్లి స్టేషన్ కాడి’ అనే పాట ఇప్పటికీ చార్ట్ బస్టర్‌గానే నిలుస్తోంది. ఆయన రష్యాలో ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎండీ, గ్యాస్ట్రోఎంటరాలజీలో డీఎం పూర్తి చేశారు. అలాగే ఒక ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన రష్యాలో భారతీయ సంస్థలకు, సాంస్కృతిక వ్యవహారాల విభాగానికి సాంస్కృతిక కార్యదర్శిగా కూడా సేవలందించారు.భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి 'నేను సైతం', 'మా ఇలవేల్పు', 'బ్రోకర్ 2', 'పంచముఖి', 'వీరగాధ', 'ఆజ్ కా ఇంక్విలాబ్', 'నాగ్ లక్ష్మి' వంటి అనేక చిత్రాలలో కథానాయకుడిగా నటించి, నిర్మించారు. ఆయన నటుడిగా, చిత్రనిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎం.డి, గ్యాస్ట్రోఎంటరాలజీలో డి.ఎం వంటి ప్రత్యేక వైద్య అర్హతలు కలిగిన డాక్టర్ మాదాల రవి గారి నిజమైన వైద్య సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వైద్యాన్ని వ్యాపారంగా చూడని ఆయన తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తృత వైద్య శిబిరాలను నిర్వహించి పేదలకు సేవ చేశారు. ఆయన అందించే సేవల్లో ప్రధానంగా శ్రామిక కుటుంబాలు, రోజువారీ కూలీలు, ప్రత్యేక జీర్ణాశయ సంబంధిత వ్యాది గ్రస్తులు, నిరుపేద వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. నిస్వార్థంగా వైద్య సేవల అందించడం ద్వారా ఆయన పీపుల్స్ డాక్టర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ప్రజా నాట్య మండలి, సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీల నాయకుడిగా, ఆయన అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, వాటిలో పాల్గొన్నారు. సామాజిక దురాగతాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం కలిగించడానికి కళే అత్యంత శక్తివంతమైన సాధనమని ఆయన గట్టిగా నమ్ముతారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడైన డాక్టర్ మాదాల రవి, వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ‘మా’ సభ్యుల సంక్షేమానికి మద్దతునిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా, చిత్ర పరిశ్రమ, నిరుపేద కార్మికుల కోసం ఉద్దేశించిన అన్ని సంక్షేమ పథకాలలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.నటుడిగా, చిత్రనిర్మాతగా సాధించిన విజయాలకు అతీతంగా, సామాజిక కార్యకర్తగా, ప్రజల వైద్యుడిగా, నటుడిగా ఆయన చేసిన అవిశ్రాంత కృషికి గాను ఆయన్ను ఎన్నో పురస్కారాలు లభించాయి. అలాంటి డా. మాదాల రవి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుందాం.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Jul 28, 2026 11:09 AM ISTమరింత చదవండి

Source link