డీడీయూజీకేవై 2.0 పోర్టల్ (https://kaushal.rural.gov.in) ప్రకారం, 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలకు (పీఐఏలు) 1,200కు పైగా ప్రాజెక్టుల కింద మొత్తం 5.6 లక్షల టార్గెట్లను కేటాయించారు. మిగతా రాష్ట్రాల్లోనూ టార్గెట్ల కేటాయింపు ప్రక్రియ చివరి దశల్లో ఉంది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అక్టోబర్ 2026లో దాదాపు 70,000 మంది గ్రామీణ యువతకు శిక్షణ ప్రారంభం కానుంది. వీరి కోసం మొత్తం 2,015 బ్యాచ్‌లు మొదలుకానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

