ప్రభన్యూస్

కంచే చేను మేస్తే.. అటవీ సంపదకు రక్షణ ఎవరు? ముగ్గురిపై సస్పెన్షన్.. అసలు బాధ్యులు ఎవరు?

పుట్టపర్తి, సెప్టెంబర్ 23, ప్రభ న్యూస్:

శ్రీ సత్యసాయి జిల్లా అటవీశాఖలో ముగ్గురు ఉద్యోగులపై ఒకేసారి సస్పెన్షన్ వేటు పడటం తీవ్ర కలకలం రేపుతోంది. సండ్ర చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్న అక్రమార్కుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో తలుపుల ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహమూర్తి, కుర్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బ్రహ్మయ్య, నంబులపూలకుంట మండలం ఎదురుదోన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెన్షన్‌కు గురైనట్లు సమాచారం.విధుల పట్ల నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నకిలీ సంతకాలతో అనుమతులు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత తీవ్ర చర్చకు దారితీస్తోంది. అయితే ఈ ఆరోపణలపై పూర్తి వాస్తవాలు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.
ముగ్గురిపై వేటు.. మరి అసలు వ్యవస్థలో లోపం ఎక్కడ?అటవీ ప్రాంతాల్లో చెట్ల అక్రమ నరికివేత, రవాణా వంటి వ్యవహారాలు కొనసాగుతున్న సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరిపోతుందా? ఇంతకాలం ఈ అక్రమ కార్యకలాపాలు ఎలా కొనసాగాయి? వాటిపై పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నతాధికారుల దృష్టికి ఈ వ్యవహారం ఎందుకు రాలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఒకవేళ అక్రమ నరికివేతలు, రవాణా లేదా అనుమతుల జారీకి సంబంధించి నిబంధనల ఉల్లంఘనలు జరిగి ఉంటే.. అవి కేవలం కింది స్థాయి సిబ్బంది పరిధిలోనే జరిగాయా? లేక మొత్తం వ్యవస్థలో ఎక్కడైనా పర్యవేక్షణ లోపించిందా? అన్నదానిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేకంగా నకిలీ సంతకాలతో అనుమతులు జారీ చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజమని విచారణలో తేలితే.. ఆ అనుమతుల వెనుక ఉన్న ప్రక్రియ, వాటిని పరిశీలించిన అధికారులు, సంబంధిత రికార్డులు, అక్రమ రవాణాతో సంబంధం ఉన్న వ్యక్తుల పాత్ర వంటి అంశాలన్నింటినీ అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.
ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌తోనే వ్యవహారం ముగుస్తుందా? లేక అక్రమ కలప రవాణా వెనుక ఉన్న మొత్తం వ్యవస్థ బయటకు వస్తుందా? అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
క్షేత్రస్థాయిలో ముగ్గురిపై చర్యలు కనిపించినా.. ఈ వ్యవహారానికి అసలు బాధ్యత ఎక్కడి వరకు ఉందన్నది తేలాల్సి ఉంది. కేవలం కింది స్థాయి సిబ్బందిపై చర్యలకే పరిమితమవకుండా, అనుమతుల జారీ నుంచి అక్రమ రవాణా వరకు మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అటవీ సంపదను కాపాడాల్సిన వ్యవస్థలోనే ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముగ్గురిపై సస్పెన్షన్‌తో కథ ముగిసిందా.. లేక అసలు కథ ఇప్పుడే మొదలైందా? అన్నది ఉన్నతాధికారుల తదుపరి చర్యలపై ఆధారపడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 September 2026, 3:13 pm Digital Edition : Prabhanews
<b>కంచే చేను మేస్తే.. అటవీ సంపదకు రక్షణ ఎవరు? ముగ్గురిపై సస్పెన్షన్.. అసలు బాధ్యులు ఎవరు?</b>