ప్రభన్యూస్

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా పోతుల జ్ఞానయ్య నియామకం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా: పోతుల జ్ఞానయ్య

హుజూర్‌నగర్‌, ప్రభ న్యూస్,అక్టోబర్ 16 :

సూర్యాపేట జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా హుజూర్‌నగర్‌కు చెందిన పోతుల జ్ఞానయ్య నియమితులయ్యారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు, పార్టీ పట్ల చూపిన నిబద్ధతను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడంపై హుజూర్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా పోతుల జ్ఞానయ్య తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని, తనకు అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 October 2026, 7:22 pm Digital Edition : Prabhanews
<b>ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా పోతుల జ్ఞానయ్య నియామకం</b>