Last Updated:
ఐఐసీటీ, నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు లభించనున్నాయి. కొత్త తరం స్టోరీటెల్లర్స్కు ప్రోత్సాహం లభిస్తుంది.
భారతదేశంలో కొత్త తరం స్టోరీ టెల్లర్స్, క్రియేటివ్ టాలెంట్‌కు మరింత ప్రోత్సాహం అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ), నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆరు ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లలో చదివే 100 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వనున్నాయి. ఈ స్కాలర్షిప్ ద్వారా కోర్సు ఫీజులో గరిష్ఠంగా 80 శాతం వరకు ఆర్థిక సాయం అందుతుంది. ఈ స్కాలర్షిప్ కింద రెండు ఏడాది కాలం డిప్లొమా కోర్సులు, నాలుగు ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. డిప్లొమా కోర్సుల్లో ఇంటరాక్టివ్ కామిక్స్ అండ్ సీక్వెన్షియల్ ఆర్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ మాస్టరీ ఉన్నాయి. ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సుల్లో వర్చువల్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కంటెంట్ క్రియేషన్, మీడియా టెక్ వర్క్‌ఫ్లో, ఆర్ట్ ఆఫ్ క్యారెక్టర్ యానిమేషన్, ఈ-స్పోర్ట్స్ అండ్ గేమింగ్ మేనేజ్మెంట్ ఉన్నాయి.

