Last Updated:
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, లాంచ్ రోజే ఏకంగా రూ.800 కోట్ల విలువైన సేల్స్ నమోదు చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ భవనంగా, తొలి పూర్తిస్థాయి గేటెడ్ కమ్యూనిటీగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. దీని ద్వారా హైదరాబాద్‌లోని అత్యంత పాత, స్థిరపడిన నివాస ప్రాంతాల్లోకి ASBL అడుగుపెట్టినట్లయింది.ed
హైదరాబాద్ నగర నడిబొడ్డున మరో భారీ ప్రాజెక్టు వచ్చింది. ASBL సంస్థ చేపట్టిన తొలి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘ASBL లెగసీ’ (ASBL Legacy) తొలి రోజే భారీ రికార్డు సృష్టించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, లాంచ్ రోజే ఏకంగా రూ.800 కోట్ల విలువైన సేల్స్ నమోదు చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ భవనంగా, తొలి పూర్తిస్థాయి గేటెడ్ కమ్యూనిటీగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తోంది. దీని ద్వారా హైదరాబాద్‌లోని అత్యంత పాత, స్థిరపడిన నివాస ప్రాంతాల్లోకి ASBL అడుగుపెట్టినట్లయింది. ఈ ప్రాజెక్ట్ లాంచ్ సందర్భంగా ASBL కొనుగోలుదారుల కోసం ‘జీరో ఈఎంఐ టిల్ హ్యాండోవర్’ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఇల్లు బుక్ చేసుకున్న కస్టమర్లు హ్యాండోవర్ అయ్యే వరకు ఎలాంటి ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్మాణ సమయంలో సాధారణంగా కస్టమర్లు కట్టాల్సిన వడ్డీని కంపెనీయే భరిస్తుంది.
సాధారణంగా నిర్మాణంలో ఉన్న ఇంటిని హోమ్ లోన్ ద్వారా కొన్నప్పుడు, నిర్మాణం జరిగే కొద్దీ బ్యాంకులు దశలవారీగా లోన్ విడుదల చేస్తాయి. అప్పుడు కొనుగోలుదారులు ఆ మొత్తానికి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే అద్దె ఇంట్లో ఉండేవారు, పాత హోమ్ లోన్ కడుతున్న కుటుంబాలకు ఒకేసారి రెండు ఇళ్ల ఆర్థిక భారం మోయడం కష్టమవుతుంది. మార్కెట్‌లో చాలా ప్రీ-ఈఎంఐ ఆఫర్లు మొదటి స్లాబ్ పూర్తయ్యే వరకు మాత్రమే ఉంటాయి. కానీ ASBL మాత్రం నిర్మాణం పూర్తయి, హ్యాండోవర్ సమాచారం ఇచ్చే వరకు వడ్డీని తానే భరిస్తుంది. కస్టమర్లు కేవలం బుకింగ్ అమౌంట్ కట్టి, మిగిలిన మొత్తాన్ని హ్యాండోవర్ సమయంలో చెల్లిస్తే సరిపోతుంది.
దాదాపు 7.97 ఎకరాల్లో విస్తరించి ఉన్న ASBL లెగసీలో G+50 అంతస్తులతో మూడు భారీ టవర్లు నిర్మిస్తున్నారు. ఇందులో 1,970 నుంచి 3,015 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 4 BHK ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.1.99 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో 73.25 శాతం ఓపెన్ స్పేస్ ఉంది. 74,000 చదరపు అడుగుల భారీ క్లబ్‌హౌస్‌తో పాటు, 50కి పైగా వసతులతో దాదాపు 1.70 లక్షల చదరపు అడుగుల అమెనిటీ స్పేస్ ఏర్పాటు చేస్తున్నారు. డబుల్ హైట్ లాబీ, రెండు మీటర్ల వెడల్పు కారిడార్లు, ప్రతి ఫ్లోర్‌లో ఒక యూనిట్‌కు ఒక లిఫ్ట్, డ్యూయల్-సింక్ స్పేస్, అవుట్‌డోర్ లివింగ్ ఏరియా, మాస్టర్ బెడ్‌రూమ్స్, ఫంక్షనల్ కిచెన్, యుటిలిటీ ఏరియాలు దీని ప్రధాన ఆకర్షణలు.
సెంట్రల్ హైదరాబాద్‌లో మంచి స్కూల్స్, కమర్షియల్ ఏరియాలు, కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒకటి. అయితే పెద్ద స్థలాలు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలు రాలేదు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నల్లకుంట, హిమాయత్ నగర్ వాసులు గేటెడ్ కమ్యూనిటీ లైఫ్‌స్టైల్ కోసం వెస్ట్ హైదరాబాద్ వైపు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ASBL లెగసీ ఆ లోటును తీరుస్తూ సెంట్రల్ హైదరాబాద్‌లోనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో స్టేషన్ కేవలం 2 నిమిషాలు, కాచిగూడ రైల్వే స్టేషన్ 8 నిమిషాలు, ఎంజీబీఎస్ (MGBS) దాదాపు 15 నిమిషాల దూరంలోనే ఉన్నాయి.
2017లో స్థాపించబడిన ASBL (అశోక బిల్డర్స్ ఇండియా) హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ. కోకాపేట, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పోచారం, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఈ సంస్థకు పలు ప్రాజెక్టులు ఉన్నాయి. లాఫ్ట్, స్ప్రింగ్స్, బ్రాడ్‌వే, స్పెక్ట్రా, ల్యాండ్‌మార్క్, స్పైర్, లేక్‌సైడ్ వంటి ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్మించింది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీగా ASBL గుర్తింపు పొందింది.

