కోఠారి సింగ్ తన పొలంలో వరి, కందిపప్పు కోసం కందులు, జొన్న వంటి పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వీటితో పాటు ఇంటి సమీపంలో ప్రత్యేకంగా కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో పొట్లకాయ, చిలగడదుంప వంటి పలు రకాల కూరగాయలను పండించారు. ప్రస్తుతం ఆయన కిచెన్ గార్డెన్‌లో సొరకాయ, వంకాయ, పచ్చిమిర్చి, టమాటా వంటి కూరగాయలు పెరుగుతున్నాయి. రోజువారీ వంటల్లో ఉపయోగించే కూరగాయలను ఇంటి వద్దే పండించుకోవడం వల్ల అవసరమైనప్పుడు తాజాగా కోసుకుని వంటల్లో వినియోగించుకోవచ్చని ఆయన చెబుతున్నారు.

