అంతర్జాతీయ వేదికపై దేశాన్ని అవమానిస్తారా?: భారత్ సమ్మిట్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం! |


Last Updated:

హైదరాబాద్ భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అమిత్ షా పుణె వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు రాహుల్ యత్నించారని ఆరోపించారు.

News18
News18

హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘భారత్ సమ్మిట్ 2026’లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సదస్సుకు ‘భారత్ సమ్మిట్’ అని పేరు పెట్టి, అంతర్జాతీయ వేదికపై భారత వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారని అమిత్ షా ఆరోపించారు. దేశవిదేశాల నుంచి వామపక్ష భావజాల ప్రచారకులను హైదరాబాద్‌కు ఆహ్వానించారని ఆయన విమర్శించారు.

వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నిరాశను కాంగ్రెస్ పార్టీ ఇలా రకరకాలుగా బయటపెట్టుకుంటోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావాలంటే విదేశీ పర్యటనలు మానుకుని దేశంలోని గ్రామాలకు వెళ్లాలని ఆయన రాహుల్ గాంధీకి హితవు పలికారు.

యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు: అమిత్ షా

గత యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల మేర కుంభకోణాలు, అవినీతి జరిగాయని అమిత్ షా ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ గద్దె నుంచి దించి నరేంద్ర మోదీని ప్రధానిని చేశారని గుర్తుచేశారు. గత 12 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీపై కనీసం నాలుగు అణాల అవినీతి ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ప్రధాని మోదీని ఓడించడం ఖాయమని, ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయని సదస్సులో పేర్కొన్నారు.

ఇటలీ నేత ‘ఓట్ చోర్’ వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం

భారత్ సమ్మిట్‌లో పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు సైతం రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని ప్రస్తావిస్తూ ఫిలిబెక్ ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ అని నినదించగా, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ నాయకుడి జోక్యాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించిందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా విమర్శించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 9:50 pm Digital Edition : Prabhanews
అంతర్జాతీయ వేదికపై దేశాన్ని అవమానిస్తారా?: భారత్ సమ్మిట్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం! |

Last Updated:Nov 15, 2026 9:44 PM ISTహైదరాబాద్ భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అమిత్ షా పుణె వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు రాహుల్ యత్నించారని ఆరోపించారు.News18హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 'భారత్ సమ్మిట్ 2026'లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఒక కార్యక్రమంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సదస్సుకు 'భారత్ సమ్మిట్' అని పేరు పెట్టి, అంతర్జాతీయ వేదికపై భారత వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారని అమిత్ షా ఆరోపించారు. దేశవిదేశాల నుంచి వామపక్ష భావజాల ప్రచారకులను హైదరాబాద్‌కు ఆహ్వానించారని ఆయన విమర్శించారు.వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నిరాశను కాంగ్రెస్ పార్టీ ఇలా రకరకాలుగా బయటపెట్టుకుంటోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావాలంటే విదేశీ పర్యటనలు మానుకుని దేశంలోని గ్రామాలకు వెళ్లాలని ఆయన రాహుల్ గాంధీకి హితవు పలికారు.యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు: అమిత్ షాగత యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల మేర కుంభకోణాలు, అవినీతి జరిగాయని అమిత్ షా ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ గద్దె నుంచి దించి నరేంద్ర మోదీని ప్రధానిని చేశారని గుర్తుచేశారు. గత 12 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీపై కనీసం నాలుగు అణాల అవినీతి ఆరోపణ కూడా రాలేదని అమిత్ షా స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ప్రధాని మోదీని ఓడించడం ఖాయమని, ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయని సదస్సులో పేర్కొన్నారు.ఇటలీ నేత 'ఓట్ చోర్' వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారంభారత్ సమ్మిట్‌లో పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్ జియాకోమో ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యలు సైతం రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఓటర్ల జాబితా సవరణ అంశాన్ని ప్రస్తావిస్తూ ఫిలిబెక్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' అని నినదించగా, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ నాయకుడి జోక్యాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించిందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా విమర్శించాయి.మరింత చదవండి

Source link