Imran Khan: ప్రపంచకప్ గెలిచాడు.. దేశ ప్రధానిగా పని చేశాడు.. ఇప్పుడు జైల్లోనే చనిపోవచ్చంటూ లెటర్! |


Last Updated:

Imran Khan: జైలులో తన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్న నేపథ్యంలో తాను తిరిగి సజీవంగా బయటకు రాకపోవచ్చని పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

PC: X.com
PC: X.com

తనకు, తన భార్య బుష్రా బీబీకి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని కోరుతూ ఆయన పాకిస్థాన్ అత్యున్నత న్యాయమూర్తులకు రాసిన బహిరంగ లేఖ సోమవారం విడుదలైంది. ఈ లేఖ ఇప్పుడు పాక్ రాజకీయ, న్యాయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

న్యాయమూర్తులకు ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తి

ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు, ఫెడరల్ రాజ్యాంగ కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. గతవారం అడియాలా జైలులో ఇమ్రాన్‌ను కలిసిన ఆయన న్యాయవాది సల్మాన్ సఫ్దర్, ఈ లేఖను సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు.

తనకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని, కారాగారంలో మెరుగైన పరిస్థితులు ఉండేలా చూడాలని గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఏమాత్రం అమలు చేయడం లేదని ఇమ్రాన్ ఆరోపించారు. “74 ఏళ్ల వయసులో నాకు ఎదురవుతున్న ఈ కఠిన పరిస్థితులు నన్ను సజీవంగా తిరిగి వచ్చే వీల్లేకుండా చేస్తున్నాయి” అని ఆయన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

ఏకాంత కారాగారంలో నరకయాతన

జైలులో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇమ్రాన్ ఖాన్ తన లేఖలో వివరంగా పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 20 నుంచి తనను ఏకాంత కారాగారంలో ఉంచారని, రోజుకు 22 గంటల పాటు బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా గడుపుతున్నానని తెలిపారు. కుటుంబ సభ్యులు, కుమారులు, న్యాయవాదులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. గదిలో కనీసం చదువుకోవడానికి పుస్తకాలు గానీ, టెలివిజన్ (టీవీ) గానీ అందుబాటులో ఉంచలేదని పేర్కొన్నారు. ఏడాది కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే న్యాయవాదులను కలిసేందుకు అనుమతించారని, జైలులో తనతో ఎవరూ మాట్లాడకుండా కఠిన ఆంక్షలు విధించారని ఆరోపించారు. కేవలం తనను తీవ్ర అనారోగ్యానికి గురిచేసేందుకే అధికారులు ఇదంతా చేస్తున్నారని ఇమ్రాన్ మండిపడ్డారు.

వందకు పైగా కేసులు.. భార్య కూడా జైలులోనే

అవినీతి, హింసను ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్‌పై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. 2023 నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. మరోవైపు, ఆయన భార్య బుష్రా బీబీని కూడా 2025 జనవరి 17న అరెస్టు చేయగా, అప్పటి నుంచి ఆమె కూడా జైలు జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ఇద్దరి ఆరోగ్య భద్రత దృష్ట్యా న్యాయవ్యవస్థ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 5:08 am Digital Edition : Prabhanews
Imran Khan: ప్రపంచకప్ గెలిచాడు.. దేశ ప్రధానిగా పని చేశాడు.. ఇప్పుడు జైల్లోనే చనిపోవచ్చంటూ లెటర్! |

Last Updated:Nov 17, 2026 4:58 AM ISTImran Khan: జైలులో తన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్న నేపథ్యంలో తాను తిరిగి సజీవంగా బయటకు రాకపోవచ్చని పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.PC: X.comతనకు, తన భార్య బుష్రా బీబీకి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని కోరుతూ ఆయన పాకిస్థాన్ అత్యున్నత న్యాయమూర్తులకు రాసిన బహిరంగ లేఖ సోమవారం విడుదలైంది. ఈ లేఖ ఇప్పుడు పాక్ రాజకీయ, న్యాయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.న్యాయమూర్తులకు ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తిప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు, ఫెడరల్ రాజ్యాంగ కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. గతవారం అడియాలా జైలులో ఇమ్రాన్‌ను కలిసిన ఆయన న్యాయవాది సల్మాన్ సఫ్దర్, ఈ లేఖను సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకున్నారు.తనకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని, కారాగారంలో మెరుగైన పరిస్థితులు ఉండేలా చూడాలని గతంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఏమాత్రం అమలు చేయడం లేదని ఇమ్రాన్ ఆరోపించారు. "74 ఏళ్ల వయసులో నాకు ఎదురవుతున్న ఈ కఠిన పరిస్థితులు నన్ను సజీవంగా తిరిగి వచ్చే వీల్లేకుండా చేస్తున్నాయి" అని ఆయన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.ఏకాంత కారాగారంలో నరకయాతనజైలులో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇమ్రాన్ ఖాన్ తన లేఖలో వివరంగా పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 20 నుంచి తనను ఏకాంత కారాగారంలో ఉంచారని, రోజుకు 22 గంటల పాటు బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా గడుపుతున్నానని తెలిపారు. కుటుంబ సభ్యులు, కుమారులు, న్యాయవాదులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని వాపోయారు. గదిలో కనీసం చదువుకోవడానికి పుస్తకాలు గానీ, టెలివిజన్ (టీవీ) గానీ అందుబాటులో ఉంచలేదని పేర్కొన్నారు. ఏడాది కాలంలో కేవలం నాలుగు సార్లు మాత్రమే న్యాయవాదులను కలిసేందుకు అనుమతించారని, జైలులో తనతో ఎవరూ మాట్లాడకుండా కఠిన ఆంక్షలు విధించారని ఆరోపించారు. కేవలం తనను తీవ్ర అనారోగ్యానికి గురిచేసేందుకే అధికారులు ఇదంతా చేస్తున్నారని ఇమ్రాన్ మండిపడ్డారు.వందకు పైగా కేసులు.. భార్య కూడా జైలులోనేఅవినీతి, హింసను ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఇమ్రాన్ ఖాన్‌పై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. 2023 నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. మరోవైపు, ఆయన భార్య బుష్రా బీబీని కూడా 2025 జనవరి 17న అరెస్టు చేయగా, అప్పటి నుంచి ఆమె కూడా జైలు జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ఇద్దరి ఆరోగ్య భద్రత దృష్ట్యా న్యాయవ్యవస్థ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించారు.మరింత చదవండి

Source link