ఈ వాషింగ్ మెషీన్‌లో ఓషియనస్ వేవ్ డ్రమ్ ఉంది. ఇది దుస్తులను మరింత మెరుగ్గా ఉతికేలా డిజైన్ చేశారు. దుస్తుల నుంచి వచ్చే లింట్‌ను మెరుగ్గా సేకరించేందుకు మ్యాజిక్ ఫిల్టర్ కూడా ఉంది. మరో ముఖ్యమైన ఫీచర్ నియర్ జీరో ప్రెజర్ (ఎన్‌జెడ్‌పీ). ఇన్‌లెట్ వాటర్ ప్రెజర్ 0.01 MPa ఉన్నా ఈ మెషీన్ పనిచేసేలా డిజైన్ చేశారు. ఇందులో ఫజీ లాజిక్ ఫీచర్ కూడా ఉంది. ఇది అవసరాన్ని బట్టి నీటి వినియోగాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఆటో వాటర్ లెవల్ ఫీచర్ కూడా ఉంటుంది. వివిధ రకాల దుస్తుల అవసరాలకు అనుగుణంగా ఈ వాషింగ్ మెషీన్‌లో ఎనిమిది వాష్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. అవి వాష్, రిన్స్, స్పిన్, టబ్ డ్రై, స్మార్ట్, సోక్, డెలికేట్, క్విక్. దుస్తుల రకం, అవసరాన్ని బట్టి సరైన సైకిల్‌ను ఎంచుకుని ఉపయోగించుకోవచ్చు. (image: Amazon India)

