ప్రభన్యూస్

Vishwak Sen: టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ కొత్త రికార్డు.. ‘కల్ట్’ సినిమాతో 150 మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ కల్ట్. అప్పుడెప్పుడో రిలీజైన టీజర్ దగ్గరనుంచి ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఈ సినిమాను ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

News18
News18

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ కల్ట్. అప్పుడెప్పుడో రిలీజైన టీజర్ దగ్గరనుంచి ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. దానికి తోడు స్లాషర్ జానర్ అవడంతో అసలు హాలీవుడ్ కాన్సెప్ట్‌ తెలుగులో ఎలా వర్కవుట్ చేస్తాడు.. అంత హింసను మన వాళ్లు యాక్సెప్ట్ చేస్తారా? ఇలా మిలియన్ డాలర్ల ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను సందీప్ కాకరాల నిర్మించాడు. అక్టోబర్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డప్పుడు తాను కూడా ఒత్తిడికి గురయ్యానని, ఏదైనా తప్పు దారిలో వెళ్తున్నానా అనే సందేహం కలిగిందని విశ్వక్ మాట్లాడాడు. అయితే, ఆ టైమ్‌లో తన అన్న చెప్పిన మాటలు తనకు ధైర్యాన్నిచ్చాయని.. తనకు కావాల్సిన ఆయుధం తన చేతిలోనే ఉందని గుర్తు చేయడంతో, మళ్లీ తనను తాను నమ్ముకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చాడు.

గతంలో ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా సమయంలో తన కోసం తానే నిలబడ్డానని.. ఇప్పుడు కూడా అదే విధంగా పోరాడాలని భావించినట్టు విష్వక్ చెప్పాడు. ఆ ఆలోచనతోనే ‘#కల్ట్‌’ సినిమాను స్టార్ట్ చేశానని వెల్లడించాడు. కెరీర్‌లో ఎదురైన పరాజయాలను చూసి వెనక్కి తగ్గకుండా.. తన బలాన్ని నమ్ముకుని కొత్త ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించాడు.

ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా విశ్వక్ బయటపెట్టారు. ముందుగా ఈ సినిమాకు ‘#కల్ట్‌’కు తాజుద్దీన్‌ను దర్శకుడిగా అనుకున్నారట. ఆయన తన నట జీవితానికి గురువని ఈ సందర్భంగా విశ్వక్ తెలిపాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల కారణంగా ఈ సినిమా బాధ్యతను తానే తీసుకోవాలని భావించి దర్శకత్వ బాధ్యతలను కూడా స్వీకరించినట్టు చెప్పుకొచ్చాడు.

ఇక ‘#కల్ట్‌’ సినిమాతో దాదాపు 150 మంది కొత్త నటీనటులు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. కొత్తవారికి అవకాశం కల్పిస్తూ, వారందరితో కలిసి ఒక సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఈ సినిమా ప్రత్యేకతగా నిలవనుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో నటీనటులు, నిర్మాతలు అందించిన సహకారం ఎంతో కీలకమని విశ్వక్ పేర్కొన్నాడు. సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతారని ధీమా వ్యక్తం చేశారు.

సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ సినిమాలో వి గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అనిరుధ్ భాస్కర్, కార్తికేయ, ఇజి, తారక్, సందీప్ కాకరాల తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 30న ‘#కల్ట్‌’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. వరుస పరాజయాల తర్వాత విష్వక్ సేన్ తన దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారు? దాదాపు 150 మంది కొత్త నటీనటులతో చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 12:15 pm Digital Edition : Prabhanews
Vishwak Sen: టాలీవుడ్‌లో విశ్వక్ సేన్ కొత్త రికార్డు.. ‘కల్ట్’ సినిమాతో 150 మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 19, 2026 12:07 PM ISTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ కల్ట్. అప్పుడెప్పుడో రిలీజైన టీజర్ దగ్గరనుంచి ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఈ సినిమాను ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
News18మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ కల్ట్. అప్పుడెప్పుడో రిలీజైన టీజర్ దగ్గరనుంచి ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. దానికి తోడు స్లాషర్ జానర్ అవడంతో అసలు హాలీవుడ్ కాన్సెప్ట్‌ తెలుగులో ఎలా వర్కవుట్ చేస్తాడు.. అంత హింసను మన వాళ్లు యాక్సెప్ట్ చేస్తారా? ఇలా మిలియన్ డాలర్ల ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను సందీప్ కాకరాల నిర్మించాడు. అక్టోబర్ 30న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడ్డప్పుడు తాను కూడా ఒత్తిడికి గురయ్యానని, ఏదైనా తప్పు దారిలో వెళ్తున్నానా అనే సందేహం కలిగిందని విశ్వక్ మాట్లాడాడు. అయితే, ఆ టైమ్‌లో తన అన్న చెప్పిన మాటలు తనకు ధైర్యాన్నిచ్చాయని.. తనకు కావాల్సిన ఆయుధం తన చేతిలోనే ఉందని గుర్తు చేయడంతో, మళ్లీ తనను తాను నమ్ముకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చాడు.గతంలో ‘ఫలక్‌నుమా దాస్‌’ సినిమా సమయంలో తన కోసం తానే నిలబడ్డానని.. ఇప్పుడు కూడా అదే విధంగా పోరాడాలని భావించినట్టు విష్వక్ చెప్పాడు. ఆ ఆలోచనతోనే ‘#కల్ట్‌’ సినిమాను స్టార్ట్ చేశానని వెల్లడించాడు. కెరీర్‌లో ఎదురైన పరాజయాలను చూసి వెనక్కి తగ్గకుండా.. తన బలాన్ని నమ్ముకుని కొత్త ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించాడు.ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా విశ్వక్ బయటపెట్టారు. ముందుగా ఈ సినిమాకు ‘#కల్ట్‌’కు తాజుద్దీన్‌ను దర్శకుడిగా అనుకున్నారట. ఆయన తన నట జీవితానికి గురువని ఈ సందర్భంగా విశ్వక్ తెలిపాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల కారణంగా ఈ సినిమా బాధ్యతను తానే తీసుకోవాలని భావించి దర్శకత్వ బాధ్యతలను కూడా స్వీకరించినట్టు చెప్పుకొచ్చాడు.ఇక ‘#కల్ట్‌’ సినిమాతో దాదాపు 150 మంది కొత్త నటీనటులు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. కొత్తవారికి అవకాశం కల్పిస్తూ, వారందరితో కలిసి ఒక సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఈ సినిమా ప్రత్యేకతగా నిలవనుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో నటీనటులు, నిర్మాతలు అందించిన సహకారం ఎంతో కీలకమని విశ్వక్ పేర్కొన్నాడు. సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే ప్రేక్షకులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతారని ధీమా వ్యక్తం చేశారు.సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ సినిమాలో వి గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అనిరుధ్ భాస్కర్, కార్తికేయ, ఇజి, తారక్, సందీప్ కాకరాల తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 30న ‘#కల్ట్‌’ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. వరుస పరాజయాల తర్వాత విష్వక్ సేన్ తన దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారు? దాదాపు 150 మంది కొత్త నటీనటులతో చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.మరింత చదవండి

Source link