ప్రభన్యూస్

Viral: వారంలో ఇది మూడోసారి.. మైనర్ బాలికపై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్! |


Last Updated:

బీహార్‌లోని జముయి, సమస్తీపూర్ ఘటనలు మరువక ముందే బంకా జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. మందార్ పర్వతంపై ఓ యువతిని ముగ్గురు యువకులు వేధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

News18
News18

బీహార్ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై వరుస వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జముయి, సమస్తీపూర్, దర్భంగా జిల్లాల్లో జరిగిన దారుణాలు మరువక ముందే తాజాగా బంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మందార్ పర్వతంపై ఓ యువతి పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 22న వాట్సాప్ ద్వారా ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో బౌన్సీ పోలీస్ స్టేషన్‌లో వెంటనే కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ఘటన జూన్ 3న జరిగినట్లు తెలుస్తోంది.

బాధితురాలు తన ఇద్దరు స్నేహితులతో కలిసి మందార్ కొండకు వెళ్లినప్పుడు అబ్దుల్లా, నితీష్ కుమార్ రాయ్, వికాస్ కుమార్ అనే ముగ్గురు యువకులు వారిని అడ్డగించారు. యువతిని వేధించడమే కాకుండా, వారిని బెదిరించి బాధితురాలి స్నేహితుడి ఖాతా నుంచి ఆన్‌లైన్ ద్వారా రూ.1,500 బలవంతంగా బదిలీ చేయించుకుని విడిచిపెట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలి వివరాలు బయటపెడుతూ వీడియో షేర్ చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ ఫైర్

ఈ ఘటనపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా చచ్చిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అసమర్థత వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బంకా మృగాలను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. గతంలో జరిగిన జముయి కేసులో మిగిలిన ఐదుగురు నిందితులు ఏమయ్యారని, సమస్తీపూర్ కేసులో నలుగురు నిందితులకు పూర్తి శిక్ష పడిందా లేక కుల సమీకరణాల ఆధారంగా వదిలేశారా అని నిలదీశారు. నిందితుల రీల్స్, కులం చూసి ముఖ్యమంత్రి న్యాయం నిర్ణయిస్తున్నారని తేజస్వి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వరుస ఘటనలతో కలకలం

న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. బీహార్‌లో వారంలోనే ఇది మూడో ఘటన కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం దర్భంగా జిల్లా కీరత్‌పూర్ గ్రామంలో పాఠశాలకు వెళ్తున్న బాలిక దుపట్టాను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు లాగేందుకు ప్రయత్నించారు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోపే వారు పారిపోయారు. జమాల్‌పూర్ పోలీసులు ఐదు గంటల్లోనే నిందితులను పట్టుకుని పోక్సో, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఇందులో 19 ఏళ్ల యువకుడిని జైలుకు తరలించగా, మరో మైనర్ నిందితుడిని జువైనల్ బోర్డు ముందు హాజరుపరిచారు.

మరోవైపు సెప్టెంబర్ 19న జముయిలో కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న ఓ బాలిక, బాలుడిని కొందరు ఆకతాయిలు రోడ్డుపై ఆపి వేధించిన వీడియో వైరల్ అయింది. ఈ కేసులో మంగళవారం జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ప్రధాన నిందితులు గాయపడగా వారిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మైనర్లతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ వేధింపుల ఘటనలు పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 September 2026, 3:05 pm Digital Edition : Prabhanews
Viral: వారంలో ఇది మూడోసారి.. మైనర్ బాలికపై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్! |

Last Updated:Sep 25, 2026 2:40 PM ISTబీహార్‌లోని జముయి, సమస్తీపూర్ ఘటనలు మరువక ముందే బంకా జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. మందార్ పర్వతంపై ఓ యువతిని ముగ్గురు యువకులు వేధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.News18బీహార్ రాష్ట్రంలో మహిళలు, బాలికలపై వరుస వేధింపుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జముయి, సమస్తీపూర్, దర్భంగా జిల్లాల్లో జరిగిన దారుణాలు మరువక ముందే తాజాగా బంకా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మందార్ పర్వతంపై ఓ యువతి పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 22న వాట్సాప్ ద్వారా ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో బౌన్సీ పోలీస్ స్టేషన్‌లో వెంటనే కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ ఘటన జూన్ 3న జరిగినట్లు తెలుస్తోంది.బాధితురాలు తన ఇద్దరు స్నేహితులతో కలిసి మందార్ కొండకు వెళ్లినప్పుడు అబ్దుల్లా, నితీష్ కుమార్ రాయ్, వికాస్ కుమార్ అనే ముగ్గురు యువకులు వారిని అడ్డగించారు. యువతిని వేధించడమే కాకుండా, వారిని బెదిరించి బాధితురాలి స్నేహితుడి ఖాతా నుంచి ఆన్‌లైన్ ద్వారా రూ.1,500 బలవంతంగా బదిలీ చేయించుకుని విడిచిపెట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితురాలి వివరాలు బయటపెడుతూ వీడియో షేర్ చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటున్నారు.
जमुई,समस्तीपुर के बाद अब “बांका” के ऐतिहासिक पर्यटन स्थल मंदार पर्वत पर नाबालिग लड़की के साथ शोषण, अभद्र व्यवहार और मारपीट का वीडियो वायरल!
बिहार में कानून व्यवस्था मृतप्राय:!मनोनीत कठपुतली मुख्यमंत्री सम्राट चौधरी अपने अनाड़ीपन, बड़बोलेपन, अपरिपक्वता, अधीरता, व्याकुलता तथा… pic.twitter.com/XjFPu2oTWZ— Tejashwi Yadav (@yadavtejashwi) September 25, 2026ప్రభుత్వంపై తేజస్వి యాదవ్ ఫైర్ఈ ఘటనపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా చచ్చిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అసమర్థత వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బంకా మృగాలను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. గతంలో జరిగిన జముయి కేసులో మిగిలిన ఐదుగురు నిందితులు ఏమయ్యారని, సమస్తీపూర్ కేసులో నలుగురు నిందితులకు పూర్తి శిక్ష పడిందా లేక కుల సమీకరణాల ఆధారంగా వదిలేశారా అని నిలదీశారు. నిందితుల రీల్స్, కులం చూసి ముఖ్యమంత్రి న్యాయం నిర్ణయిస్తున్నారని తేజస్వి ఘాటు వ్యాఖ్యలు చేశారు.వరుస ఘటనలతో కలకలంన్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. బీహార్‌లో వారంలోనే ఇది మూడో ఘటన కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం దర్భంగా జిల్లా కీరత్‌పూర్ గ్రామంలో పాఠశాలకు వెళ్తున్న బాలిక దుపట్టాను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు లాగేందుకు ప్రయత్నించారు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చేలోపే వారు పారిపోయారు. జమాల్‌పూర్ పోలీసులు ఐదు గంటల్లోనే నిందితులను పట్టుకుని పోక్సో, బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఇందులో 19 ఏళ్ల యువకుడిని జైలుకు తరలించగా, మరో మైనర్ నిందితుడిని జువైనల్ బోర్డు ముందు హాజరుపరిచారు.మరోవైపు సెప్టెంబర్ 19న జముయిలో కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న ఓ బాలిక, బాలుడిని కొందరు ఆకతాయిలు రోడ్డుపై ఆపి వేధించిన వీడియో వైరల్ అయింది. ఈ కేసులో మంగళవారం జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ప్రధాన నిందితులు గాయపడగా వారిని అరెస్ట్ చేశారు. ముగ్గురు మైనర్లతో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ వేధింపుల ఘటనలు పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారాయి.మరింత చదవండి

Source link