Last Updated:
Viral: ఒకే ఒక్క నాలుగు నిమిషాల జూమ్ (Zoom) కాల్‌తో దాదాపు 900 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న భారత సంతతి ఎగ్జిక్యూటివ్ విశాల్ గార్గ్ చివరకు తన సొంత సంస్థ నుంచే ఉద్వాసనకు గురయ్యారు.
ప్రముఖ డిజిటల్ తనఖా రుణాల సంస్థ ‘బెటర్ హోమ్ అండ్ ఫైనాన్స్’ (Better Home, Finance) సీఈవో బాధ్యతల నుంచి విశాల్ గార్గ్‌ను అధికారికంగా తొలగిస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఆయన సీఈవో పదవితో పాటు బోర్డు సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు బోర్డు ధ్రువీకరించింది.

