ప్రభన్యూస్

Vijay Deverakonda Rashmika Mandanna: విరోష్ జంటపై హద్దు దాటిన ట్రోలింగ్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు, ట్రోల్స్ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.

News18
News18

టాలీవుడ్ స్టార్ కపుల్, అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘విరోష్’ (విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న) జంటపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు, ట్రోల్స్ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ఆన్‌స్క్రీన్ జంట గురించి తరచుగా నెట్టింట ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, బాలీవుడ్ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ ఎపిసోడ్ తర్వాత వీరిద్దరి వ్యక్తిగత జీవితాలను, రిలేషన్‌షిప్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు పనిగట్టుకుని తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

ఆరంభంలో ఈ నెగెటివిటీని పెద్దగా పట్టించుకోనప్పటికీ, రాను రాను అవి శృతి మించడంతో విజయ్, రష్మిక తీవ్రస్థాయిలో స్పందించారు. తమ ప్రైవసీని గౌరవించాలని, వ్యక్తిగత జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని, అసత్యాలను ప్రచారం చేస్తే సహించేది లేదని ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ నెట్టింట ఈ వేధింపులు ఆగకపోవడం, పైగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు, తప్పుదోవ పట్టించే కల్పిత స్క్రీన్‌షాట్‌లను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తుండటంతో విరోష్ టీమ్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

తాజాగా విజయ్ దేవరకొండ, రష్మికలపై జరుగుతున్న ఈ కక్షపూరిత సైబర్ దాడిపై విరోష్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. విజయ్ తరఫున ఆయన మేనేజర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ పరువుకు భంగం కలిగించేలా ఫేక్ కంటెంట్ సృష్టించి స్ప్రెడ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో స్పష్టంగా ఆరోపించారు. ఈ నెగెటివ్ ప్రచారానికి సంబంధించిన అనేక లింక్స్‌, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, మార్ఫింగ్ ఫోటోల సాక్ష్యాలను పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. డిజిటల్ ఆధారాలను, యూఆర్ఎల్ లింక్స్‌ను విశ్లేషించి, ఐపీ అడ్రస్‌ల ద్వారా అసలైన నిందితులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అజ్ఞాతం ముసుగులో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దాడి చేసే వారికి, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారికి ఈ పరిణామం ఒక గట్టి హెచ్చరిక అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 October 2026, 7:46 am Digital Edition : Prabhanews
Vijay Deverakonda Rashmika Mandanna: విరోష్ జంటపై హద్దు దాటిన ట్రోలింగ్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 27, 2026 7:34 AM ISTవిజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు, ట్రోల్స్ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. News18టాలీవుడ్ స్టార్ కపుల్, అభిమానులు ముద్దుగా పిలుచుకునే 'విరోష్' (విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న) జంటపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు, ట్రోల్స్ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ఆన్‌స్క్రీన్ జంట గురించి తరచుగా నెట్టింట ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, బాలీవుడ్ పాపులర్ షో 'కాఫీ విత్ కరణ్' ఎపిసోడ్ తర్వాత వీరిద్దరి వ్యక్తిగత జీవితాలను, రిలేషన్‌షిప్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు పనిగట్టుకుని తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.ఆరంభంలో ఈ నెగెటివిటీని పెద్దగా పట్టించుకోనప్పటికీ, రాను రాను అవి శృతి మించడంతో విజయ్, రష్మిక తీవ్రస్థాయిలో స్పందించారు. తమ ప్రైవసీని గౌరవించాలని, వ్యక్తిగత జీవితాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని, అసత్యాలను ప్రచారం చేస్తే సహించేది లేదని ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ నెట్టింట ఈ వేధింపులు ఆగకపోవడం, పైగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు, తప్పుదోవ పట్టించే కల్పిత స్క్రీన్‌షాట్‌లను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తుండటంతో విరోష్ టీమ్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు.తాజాగా విజయ్ దేవరకొండ, రష్మికలపై జరుగుతున్న ఈ కక్షపూరిత సైబర్ దాడిపై విరోష్ టీమ్ పోలీసులను ఆశ్రయించింది. విజయ్ తరఫున ఆయన మేనేజర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ పరువుకు భంగం కలిగించేలా ఫేక్ కంటెంట్ సృష్టించి స్ప్రెడ్ చేస్తున్నారని ఆ ఫిర్యాదులో స్పష్టంగా ఆరోపించారు. ఈ నెగెటివ్ ప్రచారానికి సంబంధించిన అనేక లింక్స్‌, సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు, మార్ఫింగ్ ఫోటోల సాక్ష్యాలను పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. డిజిటల్ ఆధారాలను, యూఆర్ఎల్ లింక్స్‌ను విశ్లేషించి, ఐపీ అడ్రస్‌ల ద్వారా అసలైన నిందితులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అజ్ఞాతం ముసుగులో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై దాడి చేసే వారికి, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారికి ఈ పరిణామం ఒక గట్టి హెచ్చరిక అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరింత చదవండి

Source link