Last Updated:
రిలీజ్‌కు ఇంకా 7 నెలలకు పైగానే ఉన్నా ‘వారణాసి’ ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ టాలీవుడ్ సినీ లవర్స్‌ను కమ్మేసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీపై మొదటి ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.
రిలీజ్‌కు ఇంకా 7 నెలలకు పైగానే ఉన్నా ‘వారణాసి’ ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ టాలీవుడ్ సినీ లవర్స్‌ను కమ్మేసింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీపై మొదటి ప్రకటన నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది.
రాజమౌళి సినిమా అంటేనే షూటింగ్ విషయంలో చాలా పర్ఫెక్షన్తో ముందుకు వెళ్తుంటారు. ప్రతీ సన్నివేశాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించడంతో పాటు, కథకు అవసరమైన విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడరు. ‘వారణాసి’ విషయంలో కూడా అదే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, ప్రస్తుతం మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో చిత్రబృందం బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలో తాజాగా ‘వారణాసి’ షూటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన బజ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. సినిమాలో మహేశ్ బాబుకు సంబంధించిన మేజర్ పోర్షన్ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఆయన పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించినట్లు తెలుస్తుంది. దీంతో మహేశ్ బాబు తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నారనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
అయితే మహేశ్ బాబు పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తిగా ముగిసినట్లు మాత్రం చెప్పలేమని తెలుస్తోంది. ఆయన ఇంట్రడక్షన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఇంకా షూట్ చేయాల్సి ఉందట. ఈ సీన్లను ప్రస్తుత షెడ్యూల్లో కాకుండా తర్వాత చిత్రీకరించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కథలో హీరో ఇంట్రడక్షన్ కీలకంగా ఉండటంతో ఈ సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు రాజమౌళి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు ‘వారణాసి’లో హీరోయిన్గా నటిస్తున్న ప్రియాంక చోప్రాకు సంబంధించిన షూటింగ్ కూడా చాలావరకు పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెపై తెరకెక్కించాల్సిన మెజార్టీ సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారాం. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక ‘వారణాసి’ కథ, పాత్రలు, నిర్మాణం గురించి మేకర్స్ ఇప్పటివరకు చాలా విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. అడ్వెంచర్, ఫ్యాంటసీ అంశాలను మిళితం చేస్తూ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.
మహేశ్ బాబు కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ‘వారణాసి’ తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతుండటంతో మిగిలిన కీలక సన్నివేశాలను కూడా త్వరలో పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే మహేశ్ బాబు షూటింగ్ పూర్తయిందా? డబ్బింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు? ఇంట్రడక్షన్ సీన్లను ఎప్పుడు తెరకెక్కిస్తారు? అనే విషయాలపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న బజ్గానే చూడాలి.

