యూరిక్ యాసిడ్ పెరగడానికి గల ప్రధాన కారణాలు…: రెడ్ మీట్, సీఫుడ్, కాలేయం వంటి ప్యూరిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు మితిమీరి తినడం. బీర్, విస్కీ వంటి మద్యం అధికంగా సేవించడం, చక్కెరతో కూడిన కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం. ఊబకాయం, శరీరానికి తగినంత నీరు తాగకపోవడం, అలాగే అధిక రక్తపోటు మందుల దుష్ప్రభావాలు కూడా దీనికి దారితీస్తాయి.

