Last Updated:
కొత్తగా కొన్న టవల్ మొదట్లో చాలా మెత్తగా, దూదిలా ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఉతికిన తర్వాత అదే టవల్ గరుకుగా, గట్టిగా మారుతుంది. దీంతో టవల్ నాణ్యత బాగోలేదేమో అని అనుకుంటారు. కానీ టవల్ గట్టిపడటానికి నాణ్యత ఒక్కటే కారణం కాదు.
స్నానం చేసిన తర్వాత శరీరాన్ని తుడుచుకోవడానికి టవల్‌ను ప్రతిరోజూ ఉపయోగిస్తుంటాం. కొత్తగా కొన్న టవల్ మొదట్లో చాలా మెత్తగా, దూదిలా ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఉతికిన తర్వాత అదే టవల్ గరుకుగా, గట్టిగా మారుతుంది. దీంతో టవల్ నాణ్యత బాగోలేదేమో అని అనుకుంటారు. కానీ టవల్ గట్టిపడటానికి నాణ్యత ఒక్కటే కారణం కాదు. ఎక్కువ డిటర్జెంట్ వాడటం, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్‌ను తరచుగా ఉపయోగించడం, ఎక్కువ వేడిలో ఆరబెట్టడం, నీటిలో ఉండే ఖనిజాలు వంటివి కూడా టవల్ ఫైబర్‌లపై ప్రభావం చూపుతాయి. కొన్ని సులభమైన లాండ్రీ చిట్కాలు పాటిస్తే పాత టవల్స్‌ను కూడా మళ్లీ మెత్తగా మార్చుకోవచ్చు.

