ప్రభన్యూస్

Top10 News Today: వైభవంగా బోనాల జాతర.. ఏపీలో ఒమిక్రాన్.. రాత్రే ఫిఫా ఫైనల్.. టాప్ 10 వార్తలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు


హైదరాబాద్ లో చారిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు తలపై బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.

2- ఓటర్ల జాబితా సవరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ దాటి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను పర్యవేక్షించాలని కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉంటూ బూత్ స్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

3- శంషాబాద్‌లో హైడ్రా భూసేకరణ ఉద్రిక్తత

శంషాబాద్ పరిధిలో హైడ్రా భూసేకరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఆరోపణలపై 36 మంది నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

4-ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ ఆందోళన..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ RF-5 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 16 కేసులు ధృవీకరణ కాగా, ఇతర అనారోగ్య సమస్యల వల్ల నలుగురు మరణించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

5- ఫేస్‌బుక్ గ్లోబల్ డౌన్

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలాది మంది వినియోగదారులు లాగిన్ సమస్యలు, న్యూస్ ఫీడ్ లోడింగ్ లోపాలను ఎదుర్కొన్నారు. ఈ సాంకేతిక సమస్యల వల్ల యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై నెటిజన్లు ఇతర సోషల్ మీడియా వేదికల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

6- జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ 2026 టైటిల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనల్లో అకానె యమగూచిని ఓడించి ఏడేళ్ల సుదీర్ఘ ప్రధాన టైటిల్ కరవును ముగించింది. ఈ అద్భుత విజయంతో జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.

7- ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్

ఫిఫా వరల్డ్ కప్ 2026 తుది పోరుకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ తలపడుతున్నాయి. మెస్సి మరో చారిత్రక రికార్డుపై కన్నేయగా, స్పెయిన్ రెండోసారి కప్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

8- ఆల్ పార్టీ మీటింగ్ నుండి విపక్షాల వాకౌట్..

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వపక్ష సమావేశం నుండి ప్రతిపక్ష పార్టీలు నిరసనగా బయటకు వచ్చాయి. కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వం నిరాకరించిందని విపక్ష నేతలు ఆరోపించారు. సభ సజావుగా సాగాలంటే తమ డిమాండ్లను వినాలని పట్టుబట్టారు. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో వేడి రాజుకుంది.

9-అమెరికా, ఇరాన్ యుద్ధం తీవ్రరూపం

అమెరికా 8 రోజులుగా జరుపుతున్న బాంబు దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఎదురుదాడికి దిగింది. కువైట్, జోర్డాన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలగాలు దాడులు జరిపాయి. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేనంతగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.

10-రామాయణం సినిమాపై సాయి పల్లవి భావోద్వేగం

రామాయణం సినిమాలో సీత పాత్ర పోషించడంపై నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కావడంపై ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. సీతమ్మ పాత్రకు న్యాయం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నిన్న ఢిల్లీలో రామాయణం టీమ్ భారీ ఈవెంట్ ఏర్పాటు చేసింది. వేడుకలో రణ్ భీర్ కపూర్, యష్.. ఇతర చిత్ర బ్రందం సభ్యులు పాల్గొన్నారు. జులై 24న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 July 2026, 10:14 am Digital Edition : Prabhanews
Top10 News Today: వైభవంగా బోనాల జాతర.. ఏపీలో ఒమిక్రాన్.. రాత్రే ఫిఫా ఫైనల్.. టాప్ 10 వార్తలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

హైదరాబాద్ లో చారిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా చారిత్రాత్మక గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు తలపై బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.2- ఓటర్ల జాబితా సవరణపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలుతెలంగాణ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ దాటి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను పర్యవేక్షించాలని కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉంటూ బూత్ స్థాయిలో సమన్వయం చేసుకోవాలని సూచించారు.3- శంషాబాద్‌లో హైడ్రా భూసేకరణ ఉద్రిక్తతశంషాబాద్ పరిధిలో హైడ్రా భూసేకరణ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఆరోపణలపై 36 మంది నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.4-ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ ఆందోళన..ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ RF-5 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 16 కేసులు ధృవీకరణ కాగా, ఇతర అనారోగ్య సమస్యల వల్ల నలుగురు మరణించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.5- ఫేస్‌బుక్ గ్లోబల్ డౌన్ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేలాది మంది వినియోగదారులు లాగిన్ సమస్యలు, న్యూస్ ఫీడ్ లోడింగ్ లోపాలను ఎదుర్కొన్నారు. ఈ సాంకేతిక సమస్యల వల్ల యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై నెటిజన్లు ఇతర సోషల్ మీడియా వేదికల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.6- జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధుభారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ 2026 టైటిల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనల్లో అకానె యమగూచిని ఓడించి ఏడేళ్ల సుదీర్ఘ ప్రధాన టైటిల్ కరవును ముగించింది. ఈ అద్భుత విజయంతో జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.7- ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ఫిఫా వరల్డ్ కప్ 2026 తుది పోరుకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ తలపడుతున్నాయి. మెస్సి మరో చారిత్రక రికార్డుపై కన్నేయగా, స్పెయిన్ రెండోసారి కప్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.8- ఆల్ పార్టీ మీటింగ్ నుండి విపక్షాల వాకౌట్..ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వపక్ష సమావేశం నుండి ప్రతిపక్ష పార్టీలు నిరసనగా బయటకు వచ్చాయి. కీలక అంశాలపై చర్చకు ప్రభుత్వం నిరాకరించిందని విపక్ష నేతలు ఆరోపించారు. సభ సజావుగా సాగాలంటే తమ డిమాండ్లను వినాలని పట్టుబట్టారు. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో వేడి రాజుకుంది.9-అమెరికా, ఇరాన్ యుద్ధం తీవ్రరూపంఅమెరికా 8 రోజులుగా జరుపుతున్న బాంబు దాడులకు ప్రతికారంగా ఇరాన్ ఎదురుదాడికి దిగింది. కువైట్, జోర్డాన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలగాలు దాడులు జరిపాయి. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేనంతగా అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.10-రామాయణం సినిమాపై సాయి పల్లవి భావోద్వేగంరామాయణం సినిమాలో సీత పాత్ర పోషించడంపై నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కావడంపై ఆమె ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. సీతమ్మ పాత్రకు న్యాయం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. నిన్న ఢిల్లీలో రామాయణం టీమ్ భారీ ఈవెంట్ ఏర్పాటు చేసింది. వేడుకలో రణ్ భీర్ కపూర్, యష్.. ఇతర చిత్ర బ్రందం సభ్యులు పాల్గొన్నారు. జులై 24న ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కానుంది.

Source link