Last Updated:
చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పావని సాగి నిర్మాణంలో అరవింద్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపాయనమ:’. అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.
చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పావని సాగి నిర్మాణంలో అరవింద్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రూపాయనమ:’. అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి రూపాయల లాటరీ చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. ఫ్యామిలీ, కామెడీతో పాటు థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలను మేళవించి ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించేలా సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం తెలిపింది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. ‘రూపాయనమ:’ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను సినిమాలో చక్కగా మేళవించారని సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు వచ్చినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో సినిమా విడుదలకు సంబంధించిన పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
సినిమా నిడివి విషయానికి వస్తే.. ‘రూపాయనమ:’ మొత్తం రెండు గంటల 13 నిమిషాల రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోటి రూపాయల లాటరీ దక్కితే ఓ కుటుంబం జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి? ఆ డబ్బు చుట్టూ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి? అనే అంశాలను కథలో ఆసక్తికరంగా చూపించినట్లు తెలుస్తోంది. కామెడీతో పాటు సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమా కథనం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇప్పటికే ‘రూపాయనమ:’ సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్, టైటిల్ సాంగ్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ పోస్టర్, పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. టైటిల్‌కు తగ్గట్టుగా సినిమా కాన్సెప్ట్‌పై ఆసక్తిని పెంచేలా ఈ ప్రమోషనల్ కంటెంట్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది.
‘రూపాయనమ:’ చిత్రానికి రిషి.ఎం సంగీతం అందిస్తున్నారు. జింక వరుణ్ నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఎడిటర్‌గా రవితేజ గిరిజాల వ్యవహరిస్తున్నారు. అరవింద్ రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. పావని సాగి ఈ చిత్రాన్ని నిర్మించారు.
కోటి రూపాయల లాటరీ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలతో ఎలాంటి అనుభూతిని అందిస్తుందనే ఆసక్తి నెలకొంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రూపాయనమ:’ చిత్రాన్ని అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

