Last Updated:
తెలంగాణలోని చాలా కుటుంబాల్లో వినాయక చవితి రోజున తప్పనిసరిగా తుమ్మి కూరతో పప్పు లేదా పచ్చడి చేసి గణపయ్యకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడాదిలో మిగతా రోజుల్లో పెద్దగా వండని ఈ కూరను వినాయక చవితి రోజున మాత్రమే ప్రత్యేకంగా తయారు చేయడం వెనుక ఒక పురాణ కథ, అలాగే కొన్ని సంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి.
వినాయక చవితి అనగానే ఉండ్రాళ్లు, మోదకాలు, పులిహోర వంటి నైవేద్యాలు గుర్తుకు వస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం ఈ పండుగకు మరో ప్రత్యేకమైన వంటకం ఉంది. అదే తుమ్మి కూర. తెలంగాణలోని చాలా కుటుంబాల్లో వినాయక చవితి రోజున తప్పనిసరిగా తుమ్మి కూరతో పప్పు లేదా పచ్చడి చేసి గణపయ్యకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడాదిలో మిగతా రోజుల్లో పెద్దగా వండని ఈ కూరను వినాయక చవితి రోజున మాత్రమే ప్రత్యేకంగా తయారు చేయడం వెనుక ఒక పురాణ కథ, అలాగే కొన్ని సంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి.

