ప్రభన్యూస్

Theatre Releases: 1 కాదు 2 కాదు ఏకంగా 8 సినిమాల జాతర.. ఈ వారం థియేటర్ లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Theatre Releases: ఈ వారం థియేటర్లలో 1 కాదు 2 కాదు ఏకంగా 8 సినిమాల జాతర జరగబోతోంది. ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో.. ఆ సినిమాల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

News18
News18

Theatre Releases: సినీ ప్రియులకు ఈ వారం థియేటర్లలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ! బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్టార్ హీరోల భారీ సినిమాలు లేకపోయినా.. కంటెంట్‌తో ఆకట్టుకోవడానికి 1 కాదు 2 కాదు ఏకంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిలో ఏడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా, మరొకటి మన దేశం తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన మరాఠీ డబ్బింగ్ చిత్రం కావడం విశేషం. సుడిగాలి సుధీర్ నటించిన ‘గోట్’ ఇప్పటికే నవంబర్ 12న రిలీజ్ కాగా, శుక్రవారం (నవంబర్ 13) ఆరు సినిమాలు, శనివారం (నవంబర్ 14) మరొక సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఆ సినిమాల పూర్తి వివరాలు ఇవే!

1. ఇట్లు అర్జున (నవంబర్ 13): ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో అగ్ర తారల ప్రమోషన్స్‌తో ‘ఇట్లు అర్జున’ మూవీపై మంచి బజ్ నెలకొంది. స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మిస్తున్న ఈ సినిమాతో అనీష్ హీరోగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అనీష్ తొలి సినిమాలోనే మూగవాడి పాత్రలో నటించి మెప్పించనున్నారు.

2. గోట్ (నవంబర్ 12): బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘గోట్’ (GOAT). ఇప్పటికే నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, సుధీర్ మార్క్ కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.

3. డీఎన్‌కే (నవంబర్ 13): ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి లీడ్ రోల్‌లో నటించిన ‘దొంగ నా కొడుకు’ చిత్రం ఇప్పుడు షార్ట్ ఫామ్‌లో ‘డీఎన్‌కే’ పేరుతో వస్తోంది. యూత్‌ఫుల్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాపై కుర్రకారులో మంచి క్రేజ్ ఉంది.

4. డార్క్ చాక్లెట్ (నవంబర్ 13): రానా దగ్గుబాటి సమర్పణలో శశాంక్ శ్రీవాస్తవాయ తెరకెక్కించిన డార్క్ కామెడీ మూవీ ‘డార్క్ చాక్లెట్’. డిఫరెంట్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ అండ్ కామెడీ లవర్స్‌కు కొత్త అనుభూతిని అందించనుంది.

5. చంద్రయాన్ (నవంబర్ 13): ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో హాస్యప్రధానంగా తెరకెక్కిన ‘చంద్రయాన్’ థియేటర్లలో నవ్వులు పూయించడానికి సిద్ధమైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

6. మాయలేడి (నవంబర్ 13): ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ఫేమ్ రాకేశ్ వర్రే హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మాయలేడి’. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.

7. గోంధళ్ – ఆస్కార్ ఎంట్రీ మూవీ (నవంబర్ 13): ఈ ఏడాది భారత్ తరఫున ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా ఎంపికైన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘గోంధళ్’ తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతోంది. మరాఠా జానపద ఆచారం నేపథ్యంలో ఒక్క రాత్రిలో జరిగే ఈ ఉత్కంఠభరిత కథ సినీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ఇవ్వనుంది.

8. జయంత్ అండ్ ద జింగోపెన్ (నవంబర్ 14): శుక్రవారం సినిమాల జాతర ముగిసిన తర్వాత శనివారం (నవంబర్ 14న) నవీన్ దేశబోయిన దర్శకత్వంలో రూపొందిన ‘జయంత్ అండ్ ద జింగోపెన్’ కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది.

మొత్తానికి డిఫరెంట్ జోనర్లతో వస్తున్న ఈ ఎనిమిది చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర విన్నర్‌గా నిలుస్తుందో చూడాలి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 5:21 pm Digital Edition : Prabhanews
Theatre Releases: 1 కాదు 2 కాదు ఏకంగా 8 సినిమాల జాతర.. ఈ వారం థియేటర్ లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 12, 2026 5:20 PM ISTTheatre Releases: ఈ వారం థియేటర్లలో 1 కాదు 2 కాదు ఏకంగా 8 సినిమాల జాతర జరగబోతోంది. ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో.. ఆ సినిమాల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం... News18Theatre Releases: సినీ ప్రియులకు ఈ వారం థియేటర్లలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ! బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్టార్ హీరోల భారీ సినిమాలు లేకపోయినా.. కంటెంట్‌తో ఆకట్టుకోవడానికి 1 కాదు 2 కాదు ఏకంగా 8 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిలో ఏడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా, మరొకటి మన దేశం తరఫున ఆస్కార్‌కు నామినేట్ అయిన మరాఠీ డబ్బింగ్ చిత్రం కావడం విశేషం. సుడిగాలి సుధీర్ నటించిన 'గోట్' ఇప్పటికే నవంబర్ 12న రిలీజ్ కాగా, శుక్రవారం (నవంబర్ 13) ఆరు సినిమాలు, శనివారం (నవంబర్ 14) మరొక సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఆ సినిమాల పూర్తి వివరాలు ఇవే!1. ఇట్లు అర్జున (నవంబర్ 13): ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో అగ్ర తారల ప్రమోషన్స్‌తో 'ఇట్లు అర్జున' మూవీపై మంచి బజ్ నెలకొంది. స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మిస్తున్న ఈ సినిమాతో అనీష్ హీరోగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అనీష్ తొలి సినిమాలోనే మూగవాడి పాత్రలో నటించి మెప్పించనున్నారు.2. గోట్ (నవంబర్ 12): బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ 'గోట్' (GOAT). ఇప్పటికే నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, సుధీర్ మార్క్ కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది.3. డీఎన్‌కే (నవంబర్ 13): ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి లీడ్ రోల్‌లో నటించిన ‘దొంగ నా కొడుకు’ చిత్రం ఇప్పుడు షార్ట్ ఫామ్‌లో ‘డీఎన్‌కే’ పేరుతో వస్తోంది. యూత్‌ఫుల్ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాపై కుర్రకారులో మంచి క్రేజ్ ఉంది.4. డార్క్ చాక్లెట్ (నవంబర్ 13): రానా దగ్గుబాటి సమర్పణలో శశాంక్ శ్రీవాస్తవాయ తెరకెక్కించిన డార్క్ కామెడీ మూవీ ‘డార్క్ చాక్లెట్’. డిఫరెంట్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ అండ్ కామెడీ లవర్స్‌కు కొత్త అనుభూతిని అందించనుంది.5. చంద్రయాన్ (నవంబర్ 13): ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో హాస్యప్రధానంగా తెరకెక్కిన ‘చంద్రయాన్’ థియేటర్లలో నవ్వులు పూయించడానికి సిద్ధమైంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందింది.6. మాయలేడి (నవంబర్ 13): 'ఎవ్వరికీ చెప్పొద్దు' ఫేమ్ రాకేశ్ వర్రే హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మాయలేడి’. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.7. గోంధళ్ - ఆస్కార్ ఎంట్రీ మూవీ (నవంబర్ 13): ఈ ఏడాది భారత్ తరఫున ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా ఎంపికైన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘గోంధళ్’ తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతోంది. మరాఠా జానపద ఆచారం నేపథ్యంలో ఒక్క రాత్రిలో జరిగే ఈ ఉత్కంఠభరిత కథ సినీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ థ్రిల్ ఇవ్వనుంది.8. జయంత్ అండ్ ద జింగోపెన్ (నవంబర్ 14): శుక్రవారం సినిమాల జాతర ముగిసిన తర్వాత శనివారం (నవంబర్ 14న) నవీన్ దేశబోయిన దర్శకత్వంలో రూపొందిన ‘జయంత్ అండ్ ద జింగోపెన్’ కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది.మొత్తానికి డిఫరెంట్ జోనర్లతో వస్తున్న ఈ ఎనిమిది చిత్రాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ దగ్గర విన్నర్‌గా నిలుస్తుందో చూడాలి!మరింత చదవండి

Source link