Last Updated:
Tata Sons IPO: టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రైవేట్ కంపెనీగానే కొనసాగేందుకు వీలుగా తన కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలన్న టాటా సన్స్ అభ్యర్థనను RBI తిరస్కరించింది. దీంతో అప్పర్ లేయర్ NBFCగా కొనసాగుతున్న టాటా సన్స్‌పై తప్పనిసరి లిస్టింగ్ నిబంధనల ఒత్తిడి మరింత పెరిగింది.
భారతదేశపు అత్యంత పురాతన, అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన ‘టాటా గ్రూప్’ మాతృ సంస్థ (హోల్డింగ్ కంపెనీ) అయిన ‘టాటా సన్స్’ త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడం లాంఛనంగా మారింది. స్టాక్ మార్కెట్లో తప్పనిసరిగా పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు వెళ్లాలన్న నిబంధన నుంచి మినహాయింపు పొందాలని టాటా సన్స్ చేసిన ప్రయత్నాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్రేక్ వేసింది. తమను నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) లేదా కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్ నుంచి తప్పించాలని టాటా సన్స్ పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ తాజాగా తిరస్కరించింది. శనివారం టాటా సన్స్ కంపెనీ సెక్రటరీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లకు ఈ మేరకు తిరస్కరణ లేఖను పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై టాటా సన్స్ లేదా ఆర్బీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

