Swara Bhasker: కెరీర్ ప్రారంభంలోనే లైంగిక వేధింపులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బాలీవుడ్ నటి..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

షూటింగ్ సమయంలో లైంగిక వేధింపులకు గురయ్యా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన స్వరా భాస్కర్!
సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా షూటింగ్ సెట్స్‌లో జరిగే వేధింపుల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది.

News18
News18

షూటింగ్ సమయంలో లైంగిక వేధింపులకు గురయ్యా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన స్వరా భాస్కర్!

సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా షూటింగ్ సెట్స్‌లో జరిగే వేధింపుల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే పలువురు నటీమణులు తమ కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ కూడా తనకు ఎదురైన ఇలాంటి ఓ అనుభవాన్ని వెల్లడించారు. కెరీర్ ఆరంభంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 2011లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అవుట్‌డోర్ షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.

ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడి నుంచి తనకు వేధింపులు ఎదురయ్యాయని స్వరా భాస్కర్ పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో జరిగిన పరిణామాలను లైంగిక వేధింపులుగా గుర్తించలేకపోయానని చెప్పారు. శారీరకంగా ఎలాంటి స్పర్శ లేకపోవడంతో తనకు ఎదురైన ప్రవర్తన కూడా వేధింపుల పరిధిలోకి వస్తుందని అప్పుడు అర్థం చేసుకోలేకపోయానని వివరించారు. ప్రస్తుతం ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ తన అనుభవాలను పంచుకున్నారు.

కెరీర్ ప్రారంభ దశలో ఉండటంతో అప్పట్లో తాను చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నానని స్వరా తెలిపారు. సినిమా అవకాశాలు కోల్పోతాననే భయం తనలో ఉండేదని చెప్పారు. ముఖ్యంగా అప్పుడప్పుడే నటిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం తన కెరీర్‌పై ప్రభావం చూపిస్తుందని భావించినట్లు వెల్లడించారు. అందుకే ఎదురైన ఇబ్బందులను భరించుకుంటూ ఆ సినిమా నుంచి తప్పుకోకుండా కొనసాగినట్లు చెప్పారు.

సినిమా రంగంలో కొత్తగా అడుగుపెట్టే సమయంలో అవకాశాల కోసం చాలా మంది నటీనటులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళా నటీమణులు తమ కెరీర్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో తమకు ఎదురయ్యే అసౌకర్యాలను కూడా బయటపెట్టలేకపోతుంటారు. స్వరా భాస్కర్ చెప్పిన అనుభవం కూడా అలాంటి పరిస్థితులను మరోసారి గుర్తు చేస్తోంది. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల తాను ఇబ్బందిగా భావించినా, దాన్ని ప్రశ్నించే ధైర్యం లేదా పరిస్థితులు లేకపోవడం ఎంతటి మానసిక ఒత్తిడికి కారణమవుతుందో ఆమె మాటల్లో స్పష్టమవుతోంది.

ఇక స్వరా భాస్కర్ విషయానికి వస్తే.. హిందీ సినిమాలతో పాటు పలు వెబ్ ప్రాజెక్టుల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, దర్శకుడి గుర్తింపు వంటి అంశాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 6:47 pm Digital Edition : Prabhanews
Swara Bhasker: కెరీర్ ప్రారంభంలోనే లైంగిక వేధింపులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బాలీవుడ్ నటి..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 15, 2026 6:44 PM ISTషూటింగ్ సమయంలో లైంగిక వేధింపులకు గురయ్యా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన స్వరా భాస్కర్!
సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా షూటింగ్ సెట్స్‌లో జరిగే వేధింపుల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది.News18షూటింగ్ సమయంలో లైంగిక వేధింపులకు గురయ్యా.. షాకింగ్ విషయాలు వెల్లడించిన స్వరా భాస్కర్!సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా షూటింగ్ సెట్స్‌లో జరిగే వేధింపుల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే పలువురు నటీమణులు తమ కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ కూడా తనకు ఎదురైన ఇలాంటి ఓ అనుభవాన్ని వెల్లడించారు. కెరీర్ ఆరంభంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను లైంగిక వేధింపులకు గురయ్యానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 2011లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అవుట్‌డోర్ షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు.ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడి నుంచి తనకు వేధింపులు ఎదురయ్యాయని స్వరా భాస్కర్ పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో జరిగిన పరిణామాలను లైంగిక వేధింపులుగా గుర్తించలేకపోయానని చెప్పారు. శారీరకంగా ఎలాంటి స్పర్శ లేకపోవడంతో తనకు ఎదురైన ప్రవర్తన కూడా వేధింపుల పరిధిలోకి వస్తుందని అప్పుడు అర్థం చేసుకోలేకపోయానని వివరించారు. ప్రస్తుతం ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ తన అనుభవాలను పంచుకున్నారు.కెరీర్ ప్రారంభ దశలో ఉండటంతో అప్పట్లో తాను చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నానని స్వరా తెలిపారు. సినిమా అవకాశాలు కోల్పోతాననే భయం తనలో ఉండేదని చెప్పారు. ముఖ్యంగా అప్పుడప్పుడే నటిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం తన కెరీర్‌పై ప్రభావం చూపిస్తుందని భావించినట్లు వెల్లడించారు. అందుకే ఎదురైన ఇబ్బందులను భరించుకుంటూ ఆ సినిమా నుంచి తప్పుకోకుండా కొనసాగినట్లు చెప్పారు.సినిమా రంగంలో కొత్తగా అడుగుపెట్టే సమయంలో అవకాశాల కోసం చాలా మంది నటీనటులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళా నటీమణులు తమ కెరీర్‌ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో తమకు ఎదురయ్యే అసౌకర్యాలను కూడా బయటపెట్టలేకపోతుంటారు. స్వరా భాస్కర్ చెప్పిన అనుభవం కూడా అలాంటి పరిస్థితులను మరోసారి గుర్తు చేస్తోంది. ఒక వ్యక్తి ప్రవర్తన వల్ల తాను ఇబ్బందిగా భావించినా, దాన్ని ప్రశ్నించే ధైర్యం లేదా పరిస్థితులు లేకపోవడం ఎంతటి మానసిక ఒత్తిడికి కారణమవుతుందో ఆమె మాటల్లో స్పష్టమవుతోంది.ఇక స్వరా భాస్కర్ విషయానికి వస్తే.. హిందీ సినిమాలతో పాటు పలు వెబ్ ప్రాజెక్టుల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు, దర్శకుడి గుర్తింపు వంటి అంశాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడించలేదు.మరింత చదవండి

Source link