సంపూర్ణ ధాన్యాలు:గోధుమలు, బార్లీ, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి సంపూర్ణ ధాన్యాలు పీచుపదార్థం అధికంగా కలిగి ఉంటాయి. తెల్లపిండి లేదా అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలతో పోలిస్తే ఇవి మరింత పోషకవంతమైనవి. రొట్టెలు, గంజి లేదా ఇతర వంటకాల రూపంలో వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. (గమనిక: మధుమేహం ఉన్న ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి ఆహారంలో మార్పులు చేసేముందు డాక్టర్ లేదంటే పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. సమతుల్య ఆహారం, వ్యాయామం, సరైన జీవనశైలి కలిసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. దీనిని న్యూస్ 18 తెలుగు ధృవీకరించదు)

