Last Updated:
CJI: దేశవ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానాల్లో నాయకత్వ ఖాళీలను భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎనిమిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తులను (చీఫ్ జస్టిస్‌లు) నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ అధికారికంగా వెల్లడించారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నియామకాలు జరిగాయి. దిల్లీ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

