ప్రభన్యూస్

Sobhita Dhulipala: నా సర్వసాన్ని ధారపోశా..! శోభిత దూళిపాళ్ల ఏమంటుందో చూశారా గురూ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌ కొనసాగిస్తోంది శోభిత దూళిపాళ్ల. ప్రస్తుతం పా. రంజిత్ దర్శకత్వంలో ‘వెట్టువం’ సినిమా చేస్తున్న ఆమె, తాజాగా ఆ రోల్ పై క్రేజీ కామెంట్స్ చేశారు.

News18
News18

అందాల తార, విలక్షణ నటి శోభిత దూళిపాళ్ల తన సెకండ్ ఇన్నింగ్స్‌లో హవా నడిపిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత ఆమె నటించిన ‘చీకటిలో’ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ బ్యూటీ సిద్ధమయ్యారు. కోలీవుడ్ విలక్షణ దర్శకుడు, ‘కబాలి’, ‘కాలా’, ‘సార్పట్ట పరంపర’, ‘తంగలాన్’ వంటి వైవిధ్యమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన పా. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వెట్టువం’ (Vettuvam). ఈ ప్రాజెక్టులో శోభితా ధూళిపాళ మెయిన్ లీడ్ గా, పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో నటిస్తున్నారు.

పక్కా యాక్షన్ డ్రామాగా, సామాజిక ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, విలక్షణ నటుడు దినేష్ లతో పాటు శోభిత ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ భారీ పాన్-ఇండియా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ‘వెట్టువం’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో చాలా ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలతో పాటు మూవీ షూటింగ్‌ను కూడా లాంఛనంగా ప్రారంభించిన మేకర్స్, సినిమాపై అంచనాలు పెంచేలా ఒక స్పెషల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.

ఇక ఈ మూవీ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న శోభిత.. సినిమా గురించి, తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “దర్శకుడు పా. రంజిత్ సినిమాల్లోని స్త్రీ పాత్రలు ఎప్పుడూ ఇతరుల రక్షణ కోసం ఎదురుచూడవు. తమ సొంత హృదయం చెప్పిన మార్గంలో స్వతంత్రంగా, ధైర్యంగా నడుస్తాయి. ‘వెట్టువం’లో నేను పోషిస్తున్న పాత్ర కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ ప్రయాణం ఎన్నో పోరాటాలతో సాగుతుంది, పూర్తిగా తన సొంత నిర్ణయాల ద్వారానే ఎవరి మీదా ఆధారపడకుండా ముందుకు వెళ్తుంది” అని ఆమె వివరించారు.

తాను ఎంచుకునే పాత్రలకు భావోద్వేగాల పరంగా పూర్తిగా కనెక్ట్ అవుతానని, ‘వెట్టువం’లో నటించేటప్పుడు తన సర్వస్వాన్ని ధారపోశానని శోభిత చెప్పారు. “సాధారణంగా సినిమాలలో ఫైటింగ్ సీన్లన్నీ కేవలం హీరోలకే పరిమితం అవుతాయి. హీరోయిన్లకు మాత్రం కేవలం ఎమోషనల్ సీన్లు, గ్లామర్ కోసమే పరిమితం చేస్తారు. కానీ ఈ చిత్రంలో ఆ పాత ట్రెండ్ పూర్తిగా మారుతోంది. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో సగం నేనే స్వయంగా ఫైట్స్ చేస్తున్నాను. ఒక నటికి డాన్స్ చేయడానికి, ఫైట్స్ చేయడానికి, చక్కటి అభినయం ప్రదర్శించడానికి ఒకే సినిమాలో స్కోప్ దొరకడం అంటే అది నిజంగా డ్రీమ్ రోల్. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం ప్రతి నటి కల” అని శోభిత తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ యాక్షన్ డ్రామాలో తనను తాను పూర్తి స్థాయి పోరాట యోధురాలిగా వెండితెరపై చూసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 September 2026, 1:12 pm Digital Edition : Prabhanews
Sobhita Dhulipala: నా సర్వసాన్ని ధారపోశా..! శోభిత దూళిపాళ్ల ఏమంటుందో చూశారా గురూ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 19, 2026 1:07 PM ISTఅక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌ కొనసాగిస్తోంది శోభిత దూళిపాళ్ల. ప్రస్తుతం పా. రంజిత్ దర్శకత్వంలో ‘వెట్టువం’ సినిమా చేస్తున్న ఆమె, తాజాగా ఆ రోల్ పై క్రేజీ కామెంట్స్ చేశారు. News18అందాల తార, విలక్షణ నటి శోభిత దూళిపాళ్ల తన సెకండ్ ఇన్నింగ్స్‌లో హవా నడిపిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్యతో వివాహం తర్వాత ఆమె నటించిన ‘చీకటిలో’ అనే క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ బ్యూటీ సిద్ధమయ్యారు. కోలీవుడ్ విలక్షణ దర్శకుడు, ‘కబాలి’, ‘కాలా’, ‘సార్పట్ట పరంపర’, ‘తంగలాన్’ వంటి వైవిధ్యమైన బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన పా. రంజిత్ దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వెట్టువం’ (Vettuvam). ఈ ప్రాజెక్టులో శోభితా ధూళిపాళ మెయిన్ లీడ్ గా, పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో నటిస్తున్నారు.పక్కా యాక్షన్ డ్రామాగా, సామాజిక ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య, విలక్షణ నటుడు దినేష్ లతో పాటు శోభిత ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ భారీ పాన్-ఇండియా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ‘వెట్టువం’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో చాలా ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలతో పాటు మూవీ షూటింగ్‌ను కూడా లాంఛనంగా ప్రారంభించిన మేకర్స్, సినిమాపై అంచనాలు పెంచేలా ఒక స్పెషల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.ఇక ఈ మూవీ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న శోభిత.. సినిమా గురించి, తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "దర్శకుడు పా. రంజిత్ సినిమాల్లోని స్త్రీ పాత్రలు ఎప్పుడూ ఇతరుల రక్షణ కోసం ఎదురుచూడవు. తమ సొంత హృదయం చెప్పిన మార్గంలో స్వతంత్రంగా, ధైర్యంగా నడుస్తాయి. ‘వెట్టువం’లో నేను పోషిస్తున్న పాత్ర కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. నా క్యారెక్టర్ ప్రయాణం ఎన్నో పోరాటాలతో సాగుతుంది, పూర్తిగా తన సొంత నిర్ణయాల ద్వారానే ఎవరి మీదా ఆధారపడకుండా ముందుకు వెళ్తుంది" అని ఆమె వివరించారు.తాను ఎంచుకునే పాత్రలకు భావోద్వేగాల పరంగా పూర్తిగా కనెక్ట్ అవుతానని, ‘వెట్టువం’లో నటించేటప్పుడు తన సర్వస్వాన్ని ధారపోశానని శోభిత చెప్పారు. "సాధారణంగా సినిమాలలో ఫైటింగ్ సీన్లన్నీ కేవలం హీరోలకే పరిమితం అవుతాయి. హీరోయిన్లకు మాత్రం కేవలం ఎమోషనల్ సీన్లు, గ్లామర్ కోసమే పరిమితం చేస్తారు. కానీ ఈ చిత్రంలో ఆ పాత ట్రెండ్ పూర్తిగా మారుతోంది. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో సగం నేనే స్వయంగా ఫైట్స్ చేస్తున్నాను. ఒక నటికి డాన్స్ చేయడానికి, ఫైట్స్ చేయడానికి, చక్కటి అభినయం ప్రదర్శించడానికి ఒకే సినిమాలో స్కోప్ దొరకడం అంటే అది నిజంగా డ్రీమ్ రోల్. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడం ప్రతి నటి కల" అని శోభిత తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ యాక్షన్ డ్రామాలో తనను తాను పూర్తి స్థాయి పోరాట యోధురాలిగా వెండితెరపై చూసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.మరింత చదవండి

Source link