ఎందుకంటే, మన సమాజంలో ఎవరైనా కొత్తగా కలలు కంటుంటే, ముఖ్యంగా కొత్త రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారిని ఏమాత్రం ప్రోత్సహించరు. మనం ఏదైనా ఒక కొత్త పని మొదలు పెడితే, అప్పటికే ఆయా రంగాల్లో స్థిరపడిన వాళ్లు మనకు అండగా నిలబడరు, కనీసం మద్దతు కూడా ఇవ్వరు. ఈ వాస్తవం మనకు నిత్యం సమాజంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఒకవేళ ఇలాంటి సాహసోపేతమైన అడుగు వేసేది ఒక మహిళ అయితే.. వారు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, విమర్శలు రెట్టింపు అవుతాయి” అని వివరించారు.

