Skin Care: వైట్‌హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ సింపుల్ స్కిన్‌ కేర్ టిప్స్ ట్రై చేయండి! | లైఫ్ స్టైల్


Last Updated:

హార్మోన్లలో మార్పులు, అధికంగా జిడ్డు చర్మం ఉండటం, కొన్ని మేకప్ లేదా హెయిర్ కేర్ ఉత్పత్తులు కూడా ఈ సమస్యను పెంచవచ్చు. అందుకే ముఖాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు, చర్మానికి సరిపోయే ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

News18
News18

ముఖంపై చిన్న చిన్న తెల్లటి గడ్డల్లా కనిపించే వైట్‌హెడ్స్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా ముక్కు, నుదురు, గడ్డం చుట్టుపక్కల ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. చర్మంలోని రంధ్రాలు అదనపు నూనె, మృత చర్మ కణాలు వంటి పదార్థాలతో మూసుకుపోయినప్పుడు వైట్‌హెడ్స్ ఏర్పడతాయి. హార్మోన్లలో మార్పులు, అధికంగా జిడ్డు చర్మం ఉండటం, కొన్ని మేకప్ లేదా హెయిర్ కేర్ ఉత్పత్తులు కూడా ఈ సమస్యను పెంచవచ్చు. అందుకే ముఖాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు, చర్మానికి సరిపోయే ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యంమని మెడికవర్ డెర్మాటాలజిస్ట్ సత్య నాగ రవితేజ, న్యూస్18 తెలుగుతో తెలిపారు.

వైట్‌హెడ్స్ కనిపించగానే వాటిని గట్టిగా రుద్దడం, స్క్రబ్ చేయడం లేదా చేతులతో పిండడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల చర్మం మరింత ఇర్రిటేట్ కావడంతో పాటు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖాన్ని రోజుకు రెండుసార్లు మృదువైన క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవడం, అధికంగా ఆయిల్ ఉన్న ఉత్పత్తులకు బదులుగా “oil-free” లేదా “non-comedogenic” అని పేర్కొన్న ఉత్పత్తులను ఉపయోగించడం సహాయపడుతుంది.

ఇంట్లో చాలామంది కలబంద, నిమ్మరసం, తేనె, పసుపు వంటి పదార్థాలను ఉపయోగిస్తుంటారు. కలబంద జెల్‌ను స్వల్పంగా చర్మంపై అప్లై చేయడం కొందరికి చల్లదనాన్ని ఇవ్వవచ్చు. అయితే నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాయడం వల్ల కొందరిలో మంట, ఎర్రబడటం లేదా చర్మం సున్నితంగా మారడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఇలాంటి మిశ్రమాలను ఉపయోగించే ముందు చిన్న ప్రాంతంలో పరీక్ష చేయడం మంచిది. చర్మం మండడం, దురద లేదా ఎర్రబడటం కనిపిస్తే వెంటనే కడిగి వాడటం ఆపేయాలి.

తేనెను కూడా కొంతమంది ఇంటి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తారు. అయితే తేనె లేదా ఇతర సహజ పదార్థాలు వైట్‌హెడ్స్‌ను ఖచ్చితంగా తొలగిస్తాయని చెప్పడానికి తగిన వైద్య ఆధారాలు లేవు. చర్మానికి కొత్త పదార్థాన్ని ఉపయోగించే ముందు మీకు అలర్జీ లేదా సున్నితత్వం ఉందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే మొటిమలు లేదా చర్మ సమస్యలు ఉన్నవారు ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా జాగ్రత్తగా ఉండాలి.

వైట్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించేందుకు సాలిసిలిక్ యాసిడ్, అడాపలీన్ వంటి వైద్యపరంగా ఉపయోగించే పదార్థాలు సహాయపడతాయని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. సాలిసిలిక్ యాసిడ్ మూసుకుపోయిన రంధ్రాలను శుభ్రం చేయడంలో, అడాపలీన్ వైట్‌హెడ్స్ మరియు ఇతర మొటిమలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే వీటిని సూచించిన విధంగానే ఉపయోగించాలి. ఫలితం కనిపించడానికి కొన్ని వారాలు పట్టొచ్చు.

వైట్‌హెడ్స్‌తో పాటు నొప్పిగా ఉండే మొటిమలు, మచ్చలు లేదా ఎక్కువగా వ్యాపించే సమస్య ఉంటే చర్మ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది వారాలు జాగ్రత్తలు పాటించినా సమస్య తగ్గకపోతే నిపుణుల సలహా తీసుకోవాలి. సరైన చర్మ సంరక్షణ, తగిన చికిత్స, వైట్‌హెడ్స్‌ను పిండకుండా ఉండటం ద్వారా సమస్యను క్రమంగా నియంత్రించుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 October 2026, 2:56 pm Digital Edition : Prabhanews
Skin Care: వైట్‌హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ సింపుల్ స్కిన్‌ కేర్ టిప్స్ ట్రై చేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 08, 2026 2:47 PM ISTహార్మోన్లలో మార్పులు, అధికంగా జిడ్డు చర్మం ఉండటం, కొన్ని మేకప్ లేదా హెయిర్ కేర్ ఉత్పత్తులు కూడా ఈ సమస్యను పెంచవచ్చు. అందుకే ముఖాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు, చర్మానికి సరిపోయే ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.News18ముఖంపై చిన్న చిన్న తెల్లటి గడ్డల్లా కనిపించే వైట్‌హెడ్స్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా ముక్కు, నుదురు, గడ్డం చుట్టుపక్కల ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. చర్మంలోని రంధ్రాలు అదనపు నూనె, మృత చర్మ కణాలు వంటి పదార్థాలతో మూసుకుపోయినప్పుడు వైట్‌హెడ్స్ ఏర్పడతాయి. హార్మోన్లలో మార్పులు, అధికంగా జిడ్డు చర్మం ఉండటం, కొన్ని మేకప్ లేదా హెయిర్ కేర్ ఉత్పత్తులు కూడా ఈ సమస్యను పెంచవచ్చు. అందుకే ముఖాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు, చర్మానికి సరిపోయే ఉత్పత్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యంమని మెడికవర్ డెర్మాటాలజిస్ట్ సత్య నాగ రవితేజ, న్యూస్18 తెలుగుతో తెలిపారు.వైట్‌హెడ్స్ కనిపించగానే వాటిని గట్టిగా రుద్దడం, స్క్రబ్ చేయడం లేదా చేతులతో పిండడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల చర్మం మరింత ఇర్రిటేట్ కావడంతో పాటు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖాన్ని రోజుకు రెండుసార్లు మృదువైన క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవడం, అధికంగా ఆయిల్ ఉన్న ఉత్పత్తులకు బదులుగా “oil-free” లేదా “non-comedogenic” అని పేర్కొన్న ఉత్పత్తులను ఉపయోగించడం సహాయపడుతుంది.ఇంట్లో చాలామంది కలబంద, నిమ్మరసం, తేనె, పసుపు వంటి పదార్థాలను ఉపయోగిస్తుంటారు. కలబంద జెల్‌ను స్వల్పంగా చర్మంపై అప్లై చేయడం కొందరికి చల్లదనాన్ని ఇవ్వవచ్చు. అయితే నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాయడం వల్ల కొందరిలో మంట, ఎర్రబడటం లేదా చర్మం సున్నితంగా మారడం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఇలాంటి మిశ్రమాలను ఉపయోగించే ముందు చిన్న ప్రాంతంలో పరీక్ష చేయడం మంచిది. చర్మం మండడం, దురద లేదా ఎర్రబడటం కనిపిస్తే వెంటనే కడిగి వాడటం ఆపేయాలి.తేనెను కూడా కొంతమంది ఇంటి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తారు. అయితే తేనె లేదా ఇతర సహజ పదార్థాలు వైట్‌హెడ్స్‌ను ఖచ్చితంగా తొలగిస్తాయని చెప్పడానికి తగిన వైద్య ఆధారాలు లేవు. చర్మానికి కొత్త పదార్థాన్ని ఉపయోగించే ముందు మీకు అలర్జీ లేదా సున్నితత్వం ఉందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే మొటిమలు లేదా చర్మ సమస్యలు ఉన్నవారు ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా జాగ్రత్తగా ఉండాలి.వైట్‌హెడ్స్‌ ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించేందుకు సాలిసిలిక్ యాసిడ్, అడాపలీన్ వంటి వైద్యపరంగా ఉపయోగించే పదార్థాలు సహాయపడతాయని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. సాలిసిలిక్ యాసిడ్ మూసుకుపోయిన రంధ్రాలను శుభ్రం చేయడంలో, అడాపలీన్ వైట్‌హెడ్స్ మరియు ఇతర మొటిమలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే వీటిని సూచించిన విధంగానే ఉపయోగించాలి. ఫలితం కనిపించడానికి కొన్ని వారాలు పట్టొచ్చు.వైట్‌హెడ్స్‌తో పాటు నొప్పిగా ఉండే మొటిమలు, మచ్చలు లేదా ఎక్కువగా వ్యాపించే సమస్య ఉంటే చర్మ వైద్యుడిని సంప్రదించడం మంచిది. ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది వారాలు జాగ్రత్తలు పాటించినా సమస్య తగ్గకపోతే నిపుణుల సలహా తీసుకోవాలి. సరైన చర్మ సంరక్షణ, తగిన చికిత్స, వైట్‌హెడ్స్‌ను పిండకుండా ఉండటం ద్వారా సమస్యను క్రమంగా నియంత్రించుకోవచ్చు.మరింత చదవండి

Source link