భక్తి, సంప్రదాయం, చేనేత కళ… ఈ మూడింటి సమ్మేళనంగా రూపొందించిన అగ్గిపెట్టెలో ఇమిడే చీర, శాలువాను శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడికి విజయ్ కుమార్ అందజేశారు. శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, ఈ అరుదైన సృష్టి చేనేత కళకు మరో కొత్త గౌరవాన్ని తీసుకొచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

