Last Updated:
సైనస్, ముక్కు దిబ్బడ, జలుబు వంటి సమస్యలకు నొచ్చి ఆకులను సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తుంటారు. అయితే నొచ్చి ఆకులతో ఆవిరి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
వాతావరణ మార్పులు, దుమ్ము, కాలుష్యం, అలర్జీలు, జలుబు వంటి కారణాలతో చాలామందిని సైనస్ సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, తలనొప్పి, ముఖం చుట్టూ ఒత్తిడిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరికి తలలో బరువుగా ఉన్నట్లు, ముక్కు నుంచి సరిగ్గా శ్వాస తీసుకోలేకపోతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంటి చిట్కాల వైపు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే నొచ్చి ఆకులు కూడా ఇలాంటి సమస్యలకు ఉపయోగించే ఔషధ మొక్కల్లో ఒకటిగా చెబుతారు.

