ఒక పెట్టుబడిదారుడు SBIలో రూ.2 లక్షలను 222 రోజుల పాటు FD చేస్తే, సాధారణ పౌరుడికి మెచ్యూరిటీ సమయంలో రూ.7,253 వడ్డీ లభిస్తుంది. దీంతో మొత్తం మెచ్యూరిటీ మొత్తం రూ.2,07,253 అవుతుంది. అదే విధంగా, సీనియర్ సిటిజన్‌కు 6.40 శాతం వడ్డీ రేటు ప్రకారం రూ.7,875 వడ్డీ లభిస్తుంది. అంటే మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.2,07,875 అందుతుంది. సూపర్ సీనియర్ సిటిజన్‌కు 6.50 శాతం వడ్డీతో రూ.7,999 వడ్డీ లభించగా, మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.2,07,999 అందుతుంది.
