సాధారణంగా మన భారతీయుల ఆహార పళ్లెంలో కార్బోహైడ్రేట్లు మోతాదుకు మించి ఉంటున్నాయి. రోటీ, అన్నం, బంగాళదుంప లాంటివి ఎక్కువగా తింటున్నారు. ఫలితంగా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ శాతం బాగా తగ్గిపోతోంది. సరిగ్గా ఇదే కారణంతో నేటి కాలంలో చాలామంది విటమిన్-డి, విటమిన్-బి12 లోపంతో తీవ్రంగా బాధపడుతున్నారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

