భారతీయుల ఇళ్లలో బియ్యం నిత్యావసర ఆహార పదార్థం. అన్నం, పులావ్, బిర్యానీ, ఖిచిడీ వంటి అనేక వంటకాలకు బియ్యమే ప్రధాన పదార్థం. అందుకే చాలామంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటారు. అయితే, పచ్చి బియ్యం ఎంతకాలం నాణ్యత కోల్పోకుండా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. ప్యాకెట్‌పై పేర్కొన్న తేదీ దాటినంత మాత్రాన బియ్యం వెంటనే పాడైపోతుందని కాదు. వాటిని నిల్వ చేసే విధానం, పరిసరాల్లోని తేమ, బియ్యం రకం ఆధారంగా వాటి నిల్వ కాలం మారుతుంది.

