ప్రభన్యూస్

RGV: ఈ దేశంలో స్వేచ్ఛగా మూవీ చూసే అర్హత లేదా? సెన్సార్ ఎందుకు దండగ.. రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన టార్గెట్ సెన్సార్ బోర్డ్. సినిమాలకు సెన్సార్‌షిప్ విధించడం అనే పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

News18
News18

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన టార్గెట్ సెన్సార్ బోర్డ్. సినిమాలకు సెన్సార్‌షిప్ విధించడం అనే పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రేక్షకులను చిన్నపిల్లలుగా భావించి అవమానించే ఈ కాలం చెల్లిన విధానాన్ని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ, సెన్సార్ వ్యవస్థపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఓటు వేసే హక్కు ఉంటుంది.. కానీ సినిమా చూసే అర్హత ఉండదా?

ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు, గ్లోబల్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచవ్యాప్త సమాచారం అరచేతిలో ఉంటోందని వర్మ గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ సభ్యులు.. పెద్దలైన ప్రేక్షకులను సినిమాల్లోని చెడు నుంచి కాపాడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అసలు ఆ కమిటీ సభ్యుల అర్హతలు ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు. 18 ఏళ్లు నిండిన పౌరుడికి దేశ భవిష్యత్తును నిర్ణయించే నాయకుడిని ఎన్నుకునే ఓటు హక్కు ఉంటుందని రాజ్యాంగం నమ్ముతున్నప్పుడు.. అదే పౌరుడికి ఏ సినిమా చూడాలో, ఏది చూడకూడదో నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదా? అని వర్మ సూటిగా ప్రశ్నించారు. కేవలం ఒక సినిమాలోని సన్నివేశం వారిని చెడగొడుతుందని నమ్మడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

సెన్సార్ వల్ల లీకులు.. పెరుగుతున్న డిమాండ్:

సెన్సార్ కట్స్ వల్ల ఉపయోగం లేకపోగా, అది మరింత నష్టం చేస్తుందని వర్మ విశ్లేషించారు. థియేటర్లలో కట్ చేసిన సీన్లు కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్, టొరెంట్స్ ద్వారా లీక్ అవుతున్నాయని తెలిపారు. హాలీవుడ్ చిత్రం ‘అబ్సెషన్’ (Obsession) లోని తల బాదుకునే సన్నివేశాన్ని సెన్సార్ కత్తిరించిన తర్వాత, అది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా థియేటర్లో సినిమా చూసినవారి కంటే పదిరెట్లు ఎక్కువ మందికి చేరిందని ఉదాహరణగా చెప్పారు. కంటెంట్‌ను బ్యాన్ చేస్తే, ప్రజల్లో క్యూరియాసిటీ పెరిగి దానికి డిమాండ్ మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు.

పరిశ్రమ ఏకం కావాలి.. కట్స్ కాదు రేటింగ్ ఇవ్వాలి:

ఈ సెన్సార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు ఏకతాటిపైకి రావాలని వర్మ పిలుపునిచ్చారు. సెన్సార్ అధికారుల ముందు మోకరిల్లడం ఆపేసి, బహిరంగ చర్చలు, న్యాయస్థానాల ద్వారా వారి ఉనికిని సవాలు చేయాలని కోరారు. సీన్లను కత్తిరించడం మానేసి, సినిమాలో ఏ కంటెంట్ ఉందో వయసు ఆధారిత (Age-based) రేటింగ్ రూపంలో వర్గీకరించి చెప్పాలని, ఆ తర్వాత చూడాలో వద్దో ప్రేక్షకులకే వదిలేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ‘#BanTheCensor’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన తన సందేశాన్ని ముగించారు.

వాస్తవానికి సెన్సార్ బోర్డు అంటే ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)’. దాని చట్టబద్ధమైన పని సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడమే తప్ప, కత్తిరించడం కాదనే వాదన ఎప్పటినుంచో ఉంది. ఓటీటీలకు లేని సెన్సార్ థియేటర్ సినిమాలకు ఎందుకనే చర్చ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో, వర్మ వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 1:23 am Digital Edition : Prabhanews
RGV: ఈ దేశంలో స్వేచ్ఛగా మూవీ చూసే అర్హత లేదా? సెన్సార్ ఎందుకు దండగ.. రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 15, 2026 6:42 PM ISTసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన టార్గెట్ సెన్సార్ బోర్డ్. సినిమాలకు సెన్సార్‌షిప్ విధించడం అనే పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. News18సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన టార్గెట్ సెన్సార్ బోర్డ్. సినిమాలకు సెన్సార్‌షిప్ విధించడం అనే పద్ధతిని పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రేక్షకులను చిన్నపిల్లలుగా భావించి అవమానించే ఈ కాలం చెల్లిన విధానాన్ని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ, సెన్సార్ వ్యవస్థపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఓటు వేసే హక్కు ఉంటుంది.. కానీ సినిమా చూసే అర్హత ఉండదా?ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు, గ్లోబల్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచవ్యాప్త సమాచారం అరచేతిలో ఉంటోందని వర్మ గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నియమించిన ఓ కమిటీ సభ్యులు.. పెద్దలైన ప్రేక్షకులను సినిమాల్లోని చెడు నుంచి కాపాడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అసలు ఆ కమిటీ సభ్యుల అర్హతలు ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు. 18 ఏళ్లు నిండిన పౌరుడికి దేశ భవిష్యత్తును నిర్ణయించే నాయకుడిని ఎన్నుకునే ఓటు హక్కు ఉంటుందని రాజ్యాంగం నమ్ముతున్నప్పుడు.. అదే పౌరుడికి ఏ సినిమా చూడాలో, ఏది చూడకూడదో నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదా? అని వర్మ సూటిగా ప్రశ్నించారు. కేవలం ఒక సినిమాలోని సన్నివేశం వారిని చెడగొడుతుందని నమ్మడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.సెన్సార్ వల్ల లీకులు.. పెరుగుతున్న డిమాండ్:సెన్సార్ కట్స్ వల్ల ఉపయోగం లేకపోగా, అది మరింత నష్టం చేస్తుందని వర్మ విశ్లేషించారు. థియేటర్లలో కట్ చేసిన సీన్లు కొన్ని గంటల్లోనే టెలిగ్రామ్, టొరెంట్స్ ద్వారా లీక్ అవుతున్నాయని తెలిపారు. హాలీవుడ్ చిత్రం 'అబ్సెషన్' (Obsession) లోని తల బాదుకునే సన్నివేశాన్ని సెన్సార్ కత్తిరించిన తర్వాత, అది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా థియేటర్లో సినిమా చూసినవారి కంటే పదిరెట్లు ఎక్కువ మందికి చేరిందని ఉదాహరణగా చెప్పారు. కంటెంట్‌ను బ్యాన్ చేస్తే, ప్రజల్లో క్యూరియాసిటీ పెరిగి దానికి డిమాండ్ మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు.
CENSOR should be BANNEDCensoring Films Actually is an INSULT to the AUDIENCES
In an era of smartphones, global streaming, and access to infinite information, to pretend that a government appointed committee (What is the qualification of its members ?) can shield adults from…
— Ram Gopal Varma (@RGVzoomin) July 15, 2026పరిశ్రమ ఏకం కావాలి.. కట్స్ కాదు రేటింగ్ ఇవ్వాలి:ఈ సెన్సార్ నియంతృత్వానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు ఏకతాటిపైకి రావాలని వర్మ పిలుపునిచ్చారు. సెన్సార్ అధికారుల ముందు మోకరిల్లడం ఆపేసి, బహిరంగ చర్చలు, న్యాయస్థానాల ద్వారా వారి ఉనికిని సవాలు చేయాలని కోరారు. సీన్లను కత్తిరించడం మానేసి, సినిమాలో ఏ కంటెంట్ ఉందో వయసు ఆధారిత (Age-based) రేటింగ్ రూపంలో వర్గీకరించి చెప్పాలని, ఆ తర్వాత చూడాలో వద్దో ప్రేక్షకులకే వదిలేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ '#BanTheCensor' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన తన సందేశాన్ని ముగించారు.వాస్తవానికి సెన్సార్ బోర్డు అంటే 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)'. దాని చట్టబద్ధమైన పని సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడమే తప్ప, కత్తిరించడం కాదనే వాదన ఎప్పటినుంచో ఉంది. ఓటీటీలకు లేని సెన్సార్ థియేటర్ సినిమాలకు ఎందుకనే చర్చ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో, వర్మ వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,Telanganaమరింత చదవండి

Source link