ప్రభన్యూస్

Rashmika Mandanna: అక్కినేని అఖిల్‌తో రష్మిక మందన్న స్టెప్పేస్తే..! షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన తమన్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రీసెంట్ గా ‘లెనిన్’ (Lenin) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ రహస్యం బయటపెట్టారు సంగీత దర్శకుడు తమన్.

News18
News18

సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్న అక్కినేని అఖిల్ ‘లెనిన్’ (Lenin) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా విశేష స్పందన లభించింది. ముఖ్యంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ (S.S. Thaman) అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ట్యూన్స్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి తమన్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ సీక్రెట్ బయటపెట్టారు.

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో ఒక మాస్ ఐటెం సాంగ్ (స్పెషల్ సాంగ్) ఉంటే థియేటర్లలో ఆ కిక్కే వేరు. ‘లెనిన్’ మూవీ కోసం కూడా మేకర్స్ మొదట అలాంటి ఒక అదిరిపోయే ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశారట. మంచి రాయలసీమ యాసలో సాగే ఈ పాటను తమన్ చాలా ఎనర్జిటిక్‌గా, మాస్ బీట్ తో కంపోజ్ చేశారు. ఈ పాట కచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుందని తమన్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారట.

ఈ స్పెషల్ సాంగ్ లో అఖిల్ తో స్టెప్పులేయించడం కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల పేర్లను మేకర్స్ పరిశీలించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, పూజా హెగ్డేలతో పాటు కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ వంటి అందాల భామల పేర్లు తీవ్రంగా పరిశీలనలోకి వచ్చాయి. అంతా సిద్ధమై, పాట షూటింగ్ ప్రారంభించాలనుకునే సమయానికి మేకర్స్ తమ మనసు మార్చుకున్నారు. సినిమా కథకు ఈ ఐటెం సాంగ్ ఏమాత్రం సెట్ కాదని వారు భావించారు. కేవలం కమర్షియల్ హంగుల కోసం కథను పక్కదారి పట్టిస్తే, ఫ్లో దెబ్బతిని ప్రేక్షకుల నుంచి నెగెటివ్ రివ్యూలు వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేసి, చివరి నిమిషంలో ఆ పాటను సినిమా నుంచి పూర్తిగా తొలగించారు.

ఎంతో ఇష్టపడి, కష్టపడి కంపోజ్ చేసిన పాటను పక్కన పెట్టేయడంతో తమన్‌ కాస్త నిరాశ చెందారట. ఆవేశంలో, బాధలో సినిమాకు సంబంధించిన నాలుగైదు వాట్సప్ గ్రూపుల నుంచి ఆయన వెంటనే లెఫ్ట్ అయిపోయారట. “పాట తీసేయడం నాకు చాలా బాధ కలిగించింది. కానీ, ఆ పాట పెడితే కథ మారిపోతుందని వారు తీసుకున్న నిర్ణయం కరెక్టే” అని తమన్ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా.. కథను డిమాండ్ చేయని అనవసరపు ఎలిమెంట్స్ ను వదులుకుని, కేవలం కంటెంట్ నే నమ్ముకున్న అఖిల్, దర్శకుడి గట్స్ ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 July 2026, 12:35 pm Digital Edition : Prabhanews
Rashmika Mandanna: అక్కినేని అఖిల్‌తో రష్మిక మందన్న స్టెప్పేస్తే..! షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన తమన్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 29, 2026 12:26 PM ISTరీసెంట్ గా 'లెనిన్' (Lenin) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ రహస్యం బయటపెట్టారు సంగీత దర్శకుడు తమన్. News18సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తీసుకున్న అక్కినేని అఖిల్ 'లెనిన్' (Lenin) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రానికి థియేటర్లలో ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా విశేష స్పందన లభించింది. ముఖ్యంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ (S.S. Thaman) అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ట్యూన్స్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి తమన్ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ సీక్రెట్ బయటపెట్టారు.సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో ఒక మాస్ ఐటెం సాంగ్ (స్పెషల్ సాంగ్) ఉంటే థియేటర్లలో ఆ కిక్కే వేరు. 'లెనిన్' మూవీ కోసం కూడా మేకర్స్ మొదట అలాంటి ఒక అదిరిపోయే ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశారట. మంచి రాయలసీమ యాసలో సాగే ఈ పాటను తమన్ చాలా ఎనర్జిటిక్‌గా, మాస్ బీట్ తో కంపోజ్ చేశారు. ఈ పాట కచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుందని తమన్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారట.ఈ స్పెషల్ సాంగ్ లో అఖిల్ తో స్టెప్పులేయించడం కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల పేర్లను మేకర్స్ పరిశీలించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, పూజా హెగ్డేలతో పాటు కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ వంటి అందాల భామల పేర్లు తీవ్రంగా పరిశీలనలోకి వచ్చాయి. అంతా సిద్ధమై, పాట షూటింగ్ ప్రారంభించాలనుకునే సమయానికి మేకర్స్ తమ మనసు మార్చుకున్నారు. సినిమా కథకు ఈ ఐటెం సాంగ్ ఏమాత్రం సెట్ కాదని వారు భావించారు. కేవలం కమర్షియల్ హంగుల కోసం కథను పక్కదారి పట్టిస్తే, ఫ్లో దెబ్బతిని ప్రేక్షకుల నుంచి నెగెటివ్ రివ్యూలు వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేసి, చివరి నిమిషంలో ఆ పాటను సినిమా నుంచి పూర్తిగా తొలగించారు.ఎంతో ఇష్టపడి, కష్టపడి కంపోజ్ చేసిన పాటను పక్కన పెట్టేయడంతో తమన్‌ కాస్త నిరాశ చెందారట. ఆవేశంలో, బాధలో సినిమాకు సంబంధించిన నాలుగైదు వాట్సప్ గ్రూపుల నుంచి ఆయన వెంటనే లెఫ్ట్ అయిపోయారట. "పాట తీసేయడం నాకు చాలా బాధ కలిగించింది. కానీ, ఆ పాట పెడితే కథ మారిపోతుందని వారు తీసుకున్న నిర్ణయం కరెక్టే" అని తమన్ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా.. కథను డిమాండ్ చేయని అనవసరపు ఎలిమెంట్స్ ను వదులుకుని, కేవలం కంటెంట్ నే నమ్ముకున్న అఖిల్, దర్శకుడి గట్స్ ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Jul 29, 2026 12:26 PM ISTమరింత చదవండి

Source link