Last Updated:
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘టాక్సీవాలా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్ నుంచే ఆసక్తి నెలకొంది. పైగా విజయ్, రష్మిక రియల్ లైఫ్ కపుల్ గా మారిన తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం కావడంతో థియేటర్లలో మంచి సందడి కనిపిస్తోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏ మేరకు మెప్పించిందో పరిశీలిద్దాం.
కథ: భద్ర మల్లన్న (లాల్) ఆశీర్వాదంతో రాజమ్మ (ఈశ్వరీరావు)కు పుట్టిన బిడ్డ రణబాలి (విజయ్ దేవరకొండ). పుట్టుకతోనే మృత్యువును జయించిన రణబాలికి కేవలం రెండు పుష్కరాల ఆయుష్షు మాత్రమే ఉంటుంది. సింగనమల ప్రాంతానికి అండగా నిలిచే రణబాలికి, జయమ్మ (రష్మిక మందన్న)తో వివాహం జరుగుతుంది. ఆ సమయంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువు విలయతాండవం చేస్తుంటుంది. దయలేని బ్రిటిష్ కమీషనర్ థియోడర్ హెక్టర్ (హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లో) కరువు పరిస్థితుల్లోనూ పన్నుల భారం మోపుతూ, ప్రజల వద్ద ఉన్న ధాన్యాన్ని బలవంతంగా లాక్కుంటాడు. ఈ కరువు రాక్షసుడిని ఎదిరించి, ప్రజల ఆకలి తీర్చడానికి రణబాలి ఏ విధంగా పోరాడాడు? ఈ ప్రయాణంలో జయమ్మ చేసిన త్యాగం ఏంటి? అనేది ఈ చిత్ర కథ.
రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ పరకాయ ప్రవేశం చేశాడు. తనదైన అగ్రెసివ్ నటనతో, ఇంటెన్స్ లుక్స్‌తో సినిమాను తన భుజాలపై నడిపించాడు. జయమ్మగా రష్మిక మందన్న స్క్రీన్ స్పేస్ కాస్త తక్కువే అయినా ఉన్నంతలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లో విలనిజం సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఆ కాలపు పరిస్థితులను కళ్లకు కట్టినట్లు సెట్స్ రూపంలో చూపించగా, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేశాయి.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ, దాన్ని తెరపైకి తీసుకురావడంలో స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదించినట్లు అనిపిస్తుంది. కరువు నేపథ్యాన్ని, ఎమోషన్స్‌ను ఆడియన్స్‌కు బలంగా కనెక్ట్ చేయడంలో కొంత తడబాటు కనిపించింది. ముఖ్యంగా సినిమాలో హింస, రక్తపాతం మోతాదు మించిపోవడం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టే అంశం. రొటీన్ కమర్షియల్ లెక్కలకు పోకుండా దర్శకుడు ఒక హానెస్ట్ అటెంప్ట్ చేశాడు. నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే ‘రణబాలి’ అవుట్ పుట్ మరింత మెరుగ్గా ఉండేది.
చివరగా.. ఇంటెన్స్ యాక్షన్ తో పాటు ఒక డిఫరెంట్ పీరియాడికల్ డ్రామాను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
రేటింగ్: 3

