ప్రభన్యూస్

Ramayana Collections: రూ.1500 కోట్లకు చేరువలో రామాయణ.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకెంత రావాలి? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వచ్చిన రామాయణ మూవీ బాక్సాఫీస్ కొల్లగొడుతోంది. ప్రస్తుతం రూ.1500 కోట్లకు చేరువలో ఉన్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి అతి చేరువలో ఉంది.

News18
News18

బాలీవుడ్ విలక్షణ దర్శకుడు నితీశ్ తివారీ అద్భుత సృష్టిలో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ సెన్సేషన్ సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైన ఈ దృశ్య కావ్యం, ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టడంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాలను మించి ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర లిఖించే దిశగా దూసుకుపోతోంది.

ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ ‘శాక్‌నిల్క్’ (Sacnilk) తాజా నివేదిక ప్రకారం, ‘రామాయణ’ విడుదలైన కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1,483.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం రూ. 1,500 కోట్ల భారీ మైలురాయిని చేరుకోవడానికి అతి చేరువలో ఉంది. 13వ రోజైన నవంబర్ 17న ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 28.70 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. 12వ రోజు వసూలైన రూ. 32 కోట్లతో పోలిస్తే ఇది 10.3 శాతం తక్కువ. తాజా కలెక్షన్లతో కలుపుకుంటే, ఇప్పటివరకు దేశీయంగా ‘రామాయణ’ మొత్తం నెట్ వసూళ్లు రూ. 821.30 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ. 981.50 కోట్లను తాకాయి. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. విదేశాల్లో ఇప్పటివరకు రూ. 502 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా సాధించిన మొత్తం వసూళ్లలో విదేశీ మార్కెట్ వాటా దాదాపు 33.8 శాతంగా ఉండటం సినిమా గ్లోబల్ అప్పీల్‌ను స్పష్టం చేస్తోంది.

ఈ సినిమా నిర్మాణ దశ నుంచే భారతీయ సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన పాజిటివ్ బజ్ ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడమే. ఇంత భారీ బడ్జెట్‌తో అసలు వెండితెరపై ఏం మాయ చేయబోతున్నారన్న క్యూరియాసిటీ ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. సినిమా విడుదలైన తర్వాత కొన్ని విషయాల్లో పూర్తిగా సాటిస్‌ఫై చేయలేకపోయినా, ఓవరాల్‌గా అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా తెరపై స్పష్టంగా కనిపించిందని సినీ విమర్శకులు సైతం ప్రశంసించారు.

రామాయణ బాక్సాఫీస్ జర్నీ విషయానికొస్తే, తొలి రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, ఇంతటి భారీ బడ్జెట్ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేస్తుందా లేదా అన్న సందేహాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. కానీ మూడో రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద అసలు జాతర మొదలైంది. ఏకధాటిగా వరుసగా 7 రోజుల పాటు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఏకైక భారతీయ చిత్రంగా ‘రామాయణ’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు సుమారు రూ. 800 కోట్ల మేర బిజినెస్ జరగగా, ట్రేడ్ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 1650 కోట్ల వసూళ్లను కొల్లగొట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ. 200 కోట్ల మేర వసూలు చేయాల్సి ఉందని, ఇంకో రెండు మూడు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 November 2026, 10:13 am Digital Edition : Prabhanews
Ramayana Collections: రూ.1500 కోట్లకు చేరువలో రామాయణ.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకెంత రావాలి? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 18, 2026 10:03 AM ISTరణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా వచ్చిన రామాయణ మూవీ బాక్సాఫీస్ కొల్లగొడుతోంది. ప్రస్తుతం రూ.1500 కోట్లకు చేరువలో ఉన్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి అతి చేరువలో ఉంది. News18బాలీవుడ్ విలక్షణ దర్శకుడు నితీశ్ తివారీ అద్భుత సృష్టిలో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, టాలీవుడ్ సెన్సేషన్ సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైన ఈ దృశ్య కావ్యం, ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టడంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాలను మించి ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర లిఖించే దిశగా దూసుకుపోతోంది.ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ 'శాక్‌నిల్క్' (Sacnilk) తాజా నివేదిక ప్రకారం, 'రామాయణ' విడుదలైన కేవలం 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1,483.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం రూ. 1,500 కోట్ల భారీ మైలురాయిని చేరుకోవడానికి అతి చేరువలో ఉంది. 13వ రోజైన నవంబర్ 17న ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 28.70 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. 12వ రోజు వసూలైన రూ. 32 కోట్లతో పోలిస్తే ఇది 10.3 శాతం తక్కువ. తాజా కలెక్షన్లతో కలుపుకుంటే, ఇప్పటివరకు దేశీయంగా 'రామాయణ' మొత్తం నెట్ వసూళ్లు రూ. 821.30 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ. 981.50 కోట్లను తాకాయి. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. విదేశాల్లో ఇప్పటివరకు రూ. 502 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా సాధించిన మొత్తం వసూళ్లలో విదేశీ మార్కెట్ వాటా దాదాపు 33.8 శాతంగా ఉండటం సినిమా గ్లోబల్ అప్పీల్‌ను స్పష్టం చేస్తోంది.ఈ సినిమా నిర్మాణ దశ నుంచే భారతీయ సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన పాజిటివ్ బజ్ ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడమే. ఇంత భారీ బడ్జెట్‌తో అసలు వెండితెరపై ఏం మాయ చేయబోతున్నారన్న క్యూరియాసిటీ ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. సినిమా విడుదలైన తర్వాత కొన్ని విషయాల్లో పూర్తిగా సాటిస్‌ఫై చేయలేకపోయినా, ఓవరాల్‌గా అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా తెరపై స్పష్టంగా కనిపించిందని సినీ విమర్శకులు సైతం ప్రశంసించారు.రామాయణ బాక్సాఫీస్ జర్నీ విషయానికొస్తే, తొలి రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, ఇంతటి భారీ బడ్జెట్ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేస్తుందా లేదా అన్న సందేహాలు ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. కానీ మూడో రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద అసలు జాతర మొదలైంది. ఏకధాటిగా వరుసగా 7 రోజుల పాటు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఏకైక భారతీయ చిత్రంగా 'రామాయణ' సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు సుమారు రూ. 800 కోట్ల మేర బిజినెస్ జరగగా, ట్రేడ్ లెక్కల ప్రకారం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 1650 కోట్ల వసూళ్లను కొల్లగొట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ. 200 కోట్ల మేర వసూలు చేయాల్సి ఉందని, ఇంకో రెండు మూడు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరింత చదవండి

Source link