ప్రభన్యూస్

High Protein Breakfast: హైప్రోటీన్ ఇచ్చే 5 బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్లు ఇవే… బరువు తగ్గించే ఈజీ రెసిపీస్!  | లైఫ్ స్టైల్


Last Updated:

High Protein Breakfast: కోడిగుడ్లు తినకుండానే శరీరానికి కావాల్సిన పూర్తి ప్రోటీన్ పొందవచ్చా? వెజిటేరియన్లకు బెస్ట్ ఆప్షన్స్ అయిన సోయా చంక్స్, పనీర్ భుర్జీ, సత్తు పిండితో 35 గ్రాముల ప్రోటీన్ ఇచ్చే 5 ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఇక్కడ చూడండి..

News18
News18

High Protein Breakfast: శరీరం దృఢంగా ఉండటానికి, కండరాల పెరుగుదలకు, రోజంతా యాక్టివ్ గా పనిచేయడానికి ప్రోటీన్ అత్యంత అవసరమైన పోషకం. బరువు తగ్గాలనుకునే వారు లేదా ఫిట్‌నెస్ పై శ్రద్ధ పెట్టే వారు ఉదయం పూట హై-ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ తినాలని లేటెస్ట్ హెల్త్ రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ప్రోటీన్ అనగానే చాలా మందికి కేవలం కోడిగుడ్లు, చికెన్ వంటి నాన్-వెజ్ ఆహారాలు మాత్రమే గుర్తుకువస్తాయి. శాకాహారులు తాము తగినంత ప్రోటీన్ తీసుకోలేకపోతున్నామని తరచూ బాధపడుతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా, గుడ్లతో పనిలేకుండా.. మీ రోజువారీ వెజ్ వంటింటి వస్తువులతోనే 25 నుండి 35 గ్రాముల ప్యూర్ ప్రోటీన్ అందించే 5 బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

1. పనీర్ భుర్జీ – మల్టీగ్రెయిన్ టోస్ట్…

శాకాహారులకు పనీర్ అనేది ఒక అద్భుతమైన ప్రోటీన్ పవర్‌హౌస్. 100 నుండి 150 గ్రాముల తాజా పనీర్ ముక్కలను తీసుకుని.. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి లైట్ ఆయిల్ తో భుర్జీలా తయారు చేసుకోవాలి. దీనిని రెండు మల్టీగ్రెయిన్ బ్రెడ్ టోస్ట్ లతో కలిపి తింటే శరీరానికి దాదాపు 25 నుండి 30 గ్రాముల హై-ప్రోటీన్ చాలా సులభంగా అందుతుంది. ఇది కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచి ఆకలిని కంట్రోల్ చేస్తుంది.

2. స్ప్రౌట్స్ – పల్సెస్ సలాడ్…

మొలకెత్తిన గింజలు లేదా స్ప్రౌట్స్ లో ప్రోటీన్ తో పాటు ఫైబర్ (పీచు పదార్థం) విపరీతంగా ఉంటుంది. పెసలు, శనగలు, వేరుశనగ పప్పులు వంటి వాటిని రాత్రంతా నానబెట్టి మొలకలు వచ్చేలా చేయాలి. ఈ మొలకెత్తిన గింజల మిశ్రమానికి కొద్దిగా సన్నగా తరిగిన కీరా, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి కలిపి సలాడ్ లా తీసుకోవాలి. ఈ బ్రేక్‌ఫాస్ట్ ద్వారా బాడీకి 25 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ లభించడమే కాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు అద్భుతంగా మెరుగవుతుంది.

3. సోయా చంక్స్ పోహా లేదా ఉప్మా…

వెజిటేరియన్ ఆహారాలలో చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఏకైక వస్తువు సోయాబీన్ లేదా సోయా చంక్స్. మనం రెగ్యులర్ గా చేసుకునే అటుకుల పోహా లేదా రవ్వ ఉప్మా వండేటప్పుడు.. అందులో సోయా చంక్స్ ను వేడి నీళ్లలో ఉడకబెట్టి, చిన్న ముక్కలుగా కోసి కలపాలి. 50 గ్రాముల సోయా చంక్స్ లోనే సుమారు 26 గ్రాముల ప్యూర్ ప్రోటీన్ దాగి ఉంటుంది. ఈ కాంబినేషన్ బ్రేక్‌ఫాస్ట్ తింటే శరీరానికి ఒకేసారి 30 నుండి 35 గ్రాముల వరకు అత్యధిక ప్రోటీన్ అందుతుంది.

4. గ్రీక్ యోగర్ట్ – నట్స్ స్మూతీ…

ఉదయాన్నే వేడి వంటలు చేసే టైం లేని వారికి ఈ టేస్టీ స్మూతీ ఒక బెస్ట్ ఆప్షన్. ఒక కప్పు గ్రీక్ యోగర్ట్ (ఇందులో సాధారణ పెరుగు కంటే ప్రోటీన్ డబుల్ ఉంటుంది) తీసుకుని మిక్సీ జార్ లో వేయాలి. అందులో ఒక అరటిపండు, కొన్ని బాదం పప్పులు, వాల్ నట్స్, ఒక స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఈ థిక్ స్మూతీ ద్వారా శరీరానికి 25 గ్రాముల ప్రోటీన్ తో పాటు గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.

5. సత్తు పరాటా లేదా సత్తు డ్రింక్…

వేయించిన శనగల పిండిని ‘సత్తు’ అని పిలుస్తారు. దీనిని పూర్ మ్యాన్స్ ప్రోటీన్ పౌడర్ అని కూడా అంటారు. గోధుమ పిండిలో సత్తు పిండిని స్టఫింగ్ లా పెట్టి పరాటాలుగా వండుకుని తినవచ్చు. లేదా ఒక గ్లాసు చల్లటి నీళ్లలో రెండు మూడు స్పూన్ల సత్తు పిండి, కొద్దిగా నిమ్మరసం, జీలకర్ర పొడి, ఉప్పు కలిపి డ్రింక్ లా తాగేయవచ్చు. ఈ సాంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్ బాడీని చల్లబరచడమే కాకుండా ఇన్స్టెంట్ గా 25 గ్రాముల ప్రోటీన్ అందించి రోజంతా నీరసం రాకుండా కాపాడుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 4:17 am Digital Edition : Prabhanews
High Protein Breakfast: హైప్రోటీన్ ఇచ్చే 5 బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్లు ఇవే… బరువు తగ్గించే ఈజీ రెసిపీస్!  | లైఫ్ స్టైల్

Last Updated:Jul 06, 2026 11:00 PM ISTHigh Protein Breakfast: కోడిగుడ్లు తినకుండానే శరీరానికి కావాల్సిన పూర్తి ప్రోటీన్ పొందవచ్చా? వెజిటేరియన్లకు బెస్ట్ ఆప్షన్స్ అయిన సోయా చంక్స్, పనీర్ భుర్జీ, సత్తు పిండితో 35 గ్రాముల ప్రోటీన్ ఇచ్చే 5 ఈజీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు ఇక్కడ చూడండి..News18High Protein Breakfast: శరీరం దృఢంగా ఉండటానికి, కండరాల పెరుగుదలకు, రోజంతా యాక్టివ్ గా పనిచేయడానికి ప్రోటీన్ అత్యంత అవసరమైన పోషకం. బరువు తగ్గాలనుకునే వారు లేదా ఫిట్‌నెస్ పై శ్రద్ధ పెట్టే వారు ఉదయం పూట హై-ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ తినాలని లేటెస్ట్ హెల్త్ రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ప్రోటీన్ అనగానే చాలా మందికి కేవలం కోడిగుడ్లు, చికెన్ వంటి నాన్-వెజ్ ఆహారాలు మాత్రమే గుర్తుకువస్తాయి. శాకాహారులు తాము తగినంత ప్రోటీన్ తీసుకోలేకపోతున్నామని తరచూ బాధపడుతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా, గుడ్లతో పనిలేకుండా.. మీ రోజువారీ వెజ్ వంటింటి వస్తువులతోనే 25 నుండి 35 గ్రాముల ప్యూర్ ప్రోటీన్ అందించే 5 బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఐడియాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.1. పనీర్ భుర్జీ - మల్టీగ్రెయిన్ టోస్ట్...శాకాహారులకు పనీర్ అనేది ఒక అద్భుతమైన ప్రోటీన్ పవర్‌హౌస్. 100 నుండి 150 గ్రాముల తాజా పనీర్ ముక్కలను తీసుకుని.. ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి లైట్ ఆయిల్ తో భుర్జీలా తయారు చేసుకోవాలి. దీనిని రెండు మల్టీగ్రెయిన్ బ్రెడ్ టోస్ట్ లతో కలిపి తింటే శరీరానికి దాదాపు 25 నుండి 30 గ్రాముల హై-ప్రోటీన్ చాలా సులభంగా అందుతుంది. ఇది కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచి ఆకలిని కంట్రోల్ చేస్తుంది.2. స్ప్రౌట్స్ - పల్సెస్ సలాడ్...మొలకెత్తిన గింజలు లేదా స్ప్రౌట్స్ లో ప్రోటీన్ తో పాటు ఫైబర్ (పీచు పదార్థం) విపరీతంగా ఉంటుంది. పెసలు, శనగలు, వేరుశనగ పప్పులు వంటి వాటిని రాత్రంతా నానబెట్టి మొలకలు వచ్చేలా చేయాలి. ఈ మొలకెత్తిన గింజల మిశ్రమానికి కొద్దిగా సన్నగా తరిగిన కీరా, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి కలిపి సలాడ్ లా తీసుకోవాలి. ఈ బ్రేక్‌ఫాస్ట్ ద్వారా బాడీకి 25 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ లభించడమే కాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు అద్భుతంగా మెరుగవుతుంది.3. సోయా చంక్స్ పోహా లేదా ఉప్మా...వెజిటేరియన్ ఆహారాలలో చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఏకైక వస్తువు సోయాబీన్ లేదా సోయా చంక్స్. మనం రెగ్యులర్ గా చేసుకునే అటుకుల పోహా లేదా రవ్వ ఉప్మా వండేటప్పుడు.. అందులో సోయా చంక్స్ ను వేడి నీళ్లలో ఉడకబెట్టి, చిన్న ముక్కలుగా కోసి కలపాలి. 50 గ్రాముల సోయా చంక్స్ లోనే సుమారు 26 గ్రాముల ప్యూర్ ప్రోటీన్ దాగి ఉంటుంది. ఈ కాంబినేషన్ బ్రేక్‌ఫాస్ట్ తింటే శరీరానికి ఒకేసారి 30 నుండి 35 గ్రాముల వరకు అత్యధిక ప్రోటీన్ అందుతుంది.4. గ్రీక్ యోగర్ట్ - నట్స్ స్మూతీ...ఉదయాన్నే వేడి వంటలు చేసే టైం లేని వారికి ఈ టేస్టీ స్మూతీ ఒక బెస్ట్ ఆప్షన్. ఒక కప్పు గ్రీక్ యోగర్ట్ (ఇందులో సాధారణ పెరుగు కంటే ప్రోటీన్ డబుల్ ఉంటుంది) తీసుకుని మిక్సీ జార్ లో వేయాలి. అందులో ఒక అరటిపండు, కొన్ని బాదం పప్పులు, వాల్ నట్స్, ఒక స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఈ థిక్ స్మూతీ ద్వారా శరీరానికి 25 గ్రాముల ప్రోటీన్ తో పాటు గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.5. సత్తు పరాటా లేదా సత్తు డ్రింక్...వేయించిన శనగల పిండిని 'సత్తు' అని పిలుస్తారు. దీనిని పూర్ మ్యాన్స్ ప్రోటీన్ పౌడర్ అని కూడా అంటారు. గోధుమ పిండిలో సత్తు పిండిని స్టఫింగ్ లా పెట్టి పరాటాలుగా వండుకుని తినవచ్చు. లేదా ఒక గ్లాసు చల్లటి నీళ్లలో రెండు మూడు స్పూన్ల సత్తు పిండి, కొద్దిగా నిమ్మరసం, జీలకర్ర పొడి, ఉప్పు కలిపి డ్రింక్ లా తాగేయవచ్చు. ఈ సాంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్ బాడీని చల్లబరచడమే కాకుండా ఇన్స్టెంట్ గా 25 గ్రాముల ప్రోటీన్ అందించి రోజంతా నీరసం రాకుండా కాపాడుతుంది.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link