రణబాలి గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విజయ్ దేవరకొండ విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారని చెబుతూ, ఈ సినిమా వెనుక ఉన్న చరిత్ర, భావోద్వేగాల గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆకలి, అన్నం, బ్రిటిష్ పాలనలో జరిగిన దారుణాలు, మరుగునపడిన చరిత్రను తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రణబాలి కథను రూపొందించినట్లు రాహుల్ సంకృత్యన్ తెలిపారు. ఈ కథ చెప్పకపోతే దర్శకుడిగా తన విజయాలన్నీ వృథా అనిపించిందని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.
