ప్రభన్యూస్

R.J Mitte Death: హాలీవుడ్‌లో విషాదం.. ‘బ్రేకింగ్ బ్యాడ్’ స్టార్ ఆత్మహత్య | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’ (Breaking Bad) ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్‌.జె.మిట్టే (34) కన్నుమూశారు.

News18
News18

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’ (Breaking Bad) ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్‌.జె.మిట్టే (34) కన్నుమూశారు. సోమవారం (అక్టోబర్ 12న) టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో ఉన్న తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు, అతడి ప్రతినిధులు అధికారికంగా ధ్రువీకరించారు. చిన్న వయసులోనే ఎన్నో అద్భుతాలు చేసిన ఈ నటుడి ఆకస్మిక మరణం హాలీవుడ్ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సెరిబ్రల్ పల్సీతో పోరాటం.. స్ఫూర్తిదాయక ప్రయాణం మిసిసిపిలోని జాక్సన్‌లో జన్మించిన మిట్టే.. మూడేళ్ల వయసు నుంచే ‘సెరిబ్రల్ పల్సీ’ (Cerebral Palsy) అనే నాడీ సంబంధిత వైకల్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ తన సమస్యను ఏనాడూ భవిష్యత్తుకు అడ్డంకిగా భావించలేదు. ఆత్మవిశ్వాసంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. 2008 నుంచి 2013 వరకు ప్రసారమైన ‘బ్రేకింగ్ బ్యాడ్’ డ్రామా సిరీస్‌లో వాల్టర్ వైట్ (బ్రయాన్ క్రాన్‌స్టన్) కుమారుడైన ‘వాల్టర్ వైట్ జూనియర్’ పాత్రలో అద్భుత నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నిజ జీవితంలో కూడా సెరిబ్రల్ పల్సీ ఉండటంతో ఆ పాత్రకు ఆయన పూర్తి ప్రాణం పోశారు. దాదాపు 56 ఎపిసోడ్లలో ఆయన కనిపించారు.

కేవలం నటుడిగానే కాకుండా.. దివ్యాంగుల హక్కుల కార్యకర్తగా, ‘యునైటెడ్ సెరిబ్రల్ పాల్సీ’ విభాగానికి, ‘ష్రైనర్స్ చిల్డ్రన్స్’ సంస్థకు అంబాసిడర్‌గా విశేష సేవలు అందించారు. ‘ద మిట్టే ఫౌండేషన్’ (The Mitte Foundation) పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడిగా ఉంటూ ఎంతో మంది వికలాంగులకు అండగా నిలిచారు. బ్రేకింగ్ బ్యాడ్ తర్వాత ‘స్విచ్డ్ ఎట్ బర్త్’, ‘ది ఓక్ రూమ్’, ‘ది గార్డియన్స్ ఆఫ్ జస్టిస్’, ‘ట్రయంఫ్’ వంటి చిత్రాలు, సిరీస్‌లలో కూడా నటించి మెప్పించారు. మరణానికి కొద్ది రోజుల ముందే ఆయన ‘టాకింగ్ టు స్ట్రేంజర్స్’ అనే సినిమా ప్రమోషన్లలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మిట్టే మరణవార్త విన్న బ్రేకింగ్ బ్యాడ్ సహనటులు సోషల్ మీడియా వేదికగా కన్నీటి నివాళులు అర్పించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 10:45 am Digital Edition : Prabhanews
R.J Mitte Death: హాలీవుడ్‌లో విషాదం.. ‘బ్రేకింగ్ బ్యాడ్’ స్టార్ ఆత్మహత్య | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 14, 2026 10:28 AM ISTప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’ (Breaking Bad) ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్‌.జె.మిట్టే (34) కన్నుమూశారు.News18ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ ‘బ్రేకింగ్ బ్యాడ్’ (Breaking Bad) ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్‌.జె.మిట్టే (34) కన్నుమూశారు. సోమవారం (అక్టోబర్ 12న) టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లేలో ఉన్న తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు, అతడి ప్రతినిధులు అధికారికంగా ధ్రువీకరించారు. చిన్న వయసులోనే ఎన్నో అద్భుతాలు చేసిన ఈ నటుడి ఆకస్మిక మరణం హాలీవుడ్ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.సెరిబ్రల్ పల్సీతో పోరాటం.. స్ఫూర్తిదాయక ప్రయాణం మిసిసిపిలోని జాక్సన్‌లో జన్మించిన మిట్టే.. మూడేళ్ల వయసు నుంచే 'సెరిబ్రల్ పల్సీ' (Cerebral Palsy) అనే నాడీ సంబంధిత వైకల్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ తన సమస్యను ఏనాడూ భవిష్యత్తుకు అడ్డంకిగా భావించలేదు. ఆత్మవిశ్వాసంతో హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. 2008 నుంచి 2013 వరకు ప్రసారమైన 'బ్రేకింగ్ బ్యాడ్' డ్రామా సిరీస్‌లో వాల్టర్ వైట్ (బ్రయాన్ క్రాన్‌స్టన్) కుమారుడైన 'వాల్టర్ వైట్ జూనియర్' పాత్రలో అద్భుత నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నిజ జీవితంలో కూడా సెరిబ్రల్ పల్సీ ఉండటంతో ఆ పాత్రకు ఆయన పూర్తి ప్రాణం పోశారు. దాదాపు 56 ఎపిసోడ్లలో ఆయన కనిపించారు.కేవలం నటుడిగానే కాకుండా.. దివ్యాంగుల హక్కుల కార్యకర్తగా, 'యునైటెడ్ సెరిబ్రల్ పాల్సీ' విభాగానికి, 'ష్రైనర్స్ చిల్డ్రన్స్' సంస్థకు అంబాసిడర్‌గా విశేష సేవలు అందించారు. 'ద మిట్టే ఫౌండేషన్' (The Mitte Foundation) పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడిగా ఉంటూ ఎంతో మంది వికలాంగులకు అండగా నిలిచారు. బ్రేకింగ్ బ్యాడ్ తర్వాత 'స్విచ్డ్ ఎట్ బర్త్', 'ది ఓక్ రూమ్', 'ది గార్డియన్స్ ఆఫ్ జస్టిస్', 'ట్రయంఫ్' వంటి చిత్రాలు, సిరీస్‌లలో కూడా నటించి మెప్పించారు. మరణానికి కొద్ది రోజుల ముందే ఆయన 'టాకింగ్ టు స్ట్రేంజర్స్' అనే సినిమా ప్రమోషన్లలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మిట్టే మరణవార్త విన్న బ్రేకింగ్ బ్యాడ్ సహనటులు సోషల్ మీడియా వేదికగా కన్నీటి నివాళులు అర్పించారు.మరింత చదవండి

Source link