Last Updated:
ప్రభుత్వ సబ్సిడీతో మినీ రైస్ మిల్లు.. తక్కువ పెట్టుబడితో అదిరిపోయే ఆదాయం, వివరాలివే!
చదువు పదో తరగతే కావచ్చు.. కానీ ఆమె సాధించిన ఘనత ఆశ్చర్యపోవాల్సిందే. వ్యాపారంలో ఎదురైన నష్టాలనే పాఠాలుగా మలచుకుని వినూత్న ఆవిష్కరణతో ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘అటల్ ఇన్నోవేషన్ అవార్డు’ అందుకుంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామానికి చెందిన 35 ఏళ్ల లక్ష్మీ అనిత సాధించిన ఈ విజయం ఇప్పుడు అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది. వడ్ల నుంచి బియ్యం ఆడించే అద్భుతమైన మినీ రైస్ మిల్లును సొంతంగా డిజైన్ చేసి మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. న్యూస్18 ప్రతినిధి మస్తాన్ వలీలో ఫోన్ కాల్ ద్వారా ఆమె పలు అంశాలను వెల్లడించారు.

