ప్రభన్యూస్

PM Modi: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు |


Last Updated:

PM Modi: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి శుక్రవారం అర్ధరాత్రి చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 (GSLV-F18) రాకెట్ ప్రయోగం నూటికి నూరు శాతం విజయవంతమైంది. తదుపరి తరం నావిగేషన్ శాటిలైట్ అయిన ‘ఎన్‌వీఎస్-03’ (NVS-03)ను ఈ రాకెట్ నిర్దేశిత జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. 24 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన అనంతరం, శుక్రవారం రాత్రి సరిగ్గా 11:51 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి 50 మీటర్ల ఎత్తున్న ఈ మూడు దశల జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 420 టన్నుల లిఫ్ట్-ఆఫ్ బరువుతో బయలుదేరిన ఈ రాకెట్, 2,232 కిలోల బరువు కలిగిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో మోహరించినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.

ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ

ఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

“ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నా హృదయపూర్వక అభినందనలు. భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అయిన ‘నావిక్’ (NavIC)ను మరింత పటిష్టం చేయడంలో ఈ మిషన్ ఒక కీలక ముందడుగు. మెరుగైన సాంకేతిక సామర్థ్యాలతో రూపొందించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం.. కీలక రంగాల్లో దేశ స్వయం సమృద్ధిని పెంచడంతో పాటు ప్రజలకు నావిగేషన్ సేవలను సమర్థంగా అందించేందుకు దోహదపడుతుంది. భారత అంతరిక్ష శాస్త్రవేత్తల నిబద్ధత, మేధోశక్తి దేశాన్ని ఎల్లప్పుడూ గర్వపడేలా చేస్తున్నాయి” అని ప్రధాని కొనియాడారు.

స్వదేశీ నావిక్‌కు సరికొత్త బలం.. ‘ఎల్1’ సిగ్నల్ ప్రత్యేకం

భారత ప్రాంతీయ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ (IRNSS – NavIC) సేవల నిరంతరాయ కొనసాగింపు కోసం ఇస్రో రూపొందిస్తున్న నెక్స్ట్-జనరేషన్ సిరీస్‌లో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఈ ఉపగ్రహంలో విదేశాల నుంచి సేకరించిన అటామిక్ క్లాక్‌లతో పాటు, ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్‌ను సైతం అమర్చారు.

ప్రస్తుతం నావిక్ వాడుతున్న ఎల్5 (L5), ఎస్-బ్యాండ్ సిగ్నల్స్‌తో పాటు, ఈ ఉపగ్రహం ద్వారా పౌర సేవల కోసం ప్రత్యేకంగా ‘ఎల్1’ (L1) ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఈ సిగ్నల్ ద్వారా భారతదేశ భూభాగంతో పాటు సరిహద్దుల చుట్టూ సుమారు 1,500 కిలోమీటర్ల మేర స్పష్టమైన నావిగేషన్ సేవలు అందుతాయి. ముఖ్యంగా ఆధునిక స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్ పరికరాలు, జీపీఎస్ ఆధారిత సివిలియన్ డివైజ్‌లకు నావిక్ మరింత అనుకూలంగా మారనుంది.

అంతరిక్ష రంగంలో విక్రమ్ సారాభాయ్ కల సాకారం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఇస్రో బృందాన్ని ప్రశంసించారు. “గత కొన్నేళ్లుగా ప్రధాని మోదీ తీసుకొచ్చిన విప్లవాత్మక అంతరిక్ష సంస్కరణల ద్వారా మన అంతరిక్ష పితామహులు విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ కన్న కలలు సాకారమవుతున్నాయి. దేశీయ నావిగేషన్ వ్యవస్థను పటిష్టం చేయడంలో భారత్ ఎదుగుతున్న సామర్థ్యానికి ఇది నిదర్శనం. యావత్ భారతానికి ఇది గర్వకారణమైన క్షణం” అని ఆయన పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 12:39 pm Digital Edition : Prabhanews
PM Modi: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు |

Last Updated:Oct 31, 2026 12:37 PM ISTPM Modi: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.ప్రధాని మోదీఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి శుక్రవారం అర్ధరాత్రి చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 (GSLV-F18) రాకెట్ ప్రయోగం నూటికి నూరు శాతం విజయవంతమైంది. తదుపరి తరం నావిగేషన్ శాటిలైట్ అయిన ‘ఎన్‌వీఎస్-03’ (NVS-03)ను ఈ రాకెట్ నిర్దేశిత జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. 24 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన అనంతరం, శుక్రవారం రాత్రి సరిగ్గా 11:51 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి 50 మీటర్ల ఎత్తున్న ఈ మూడు దశల జీఎస్‌ఎల్‌వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 420 టన్నుల లిఫ్ట్-ఆఫ్ బరువుతో బయలుదేరిన ఈ రాకెట్, 2,232 కిలోల బరువు కలిగిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో మోహరించినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు."ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నా హృదయపూర్వక అభినందనలు. భారతదేశ స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అయిన 'నావిక్' (NavIC)ను మరింత పటిష్టం చేయడంలో ఈ మిషన్ ఒక కీలక ముందడుగు. మెరుగైన సాంకేతిక సామర్థ్యాలతో రూపొందించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహం.. కీలక రంగాల్లో దేశ స్వయం సమృద్ధిని పెంచడంతో పాటు ప్రజలకు నావిగేషన్ సేవలను సమర్థంగా అందించేందుకు దోహదపడుతుంది. భారత అంతరిక్ష శాస్త్రవేత్తల నిబద్ధత, మేధోశక్తి దేశాన్ని ఎల్లప్పుడూ గర్వపడేలా చేస్తున్నాయి" అని ప్రధాని కొనియాడారు.
Congratulations to our scientists and engineers at ISRO on the successful launch of GSLV-F18 carrying NVS-03.
This mission marks an important step in strengthening NavIC, our indigenous satellite navigation system. Equipped with enhanced capabilities, NVS-03 will further our pursuit of self-reliance in critical technologies and support navigation services that benefit our people.The dedication and ingenuity of our space scientists continue to make our nation proud.@isro— Narendra Modi (@narendramodi) October 31, 2026స్వదేశీ నావిక్‌కు సరికొత్త బలం.. 'ఎల్1' సిగ్నల్ ప్రత్యేకంభారత ప్రాంతీయ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ (IRNSS - NavIC) సేవల నిరంతరాయ కొనసాగింపు కోసం ఇస్రో రూపొందిస్తున్న నెక్స్ట్-జనరేషన్ సిరీస్‌లో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఈ ఉపగ్రహంలో విదేశాల నుంచి సేకరించిన అటామిక్ క్లాక్‌లతో పాటు, ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్‌ను సైతం అమర్చారు.ప్రస్తుతం నావిక్ వాడుతున్న ఎల్5 (L5), ఎస్-బ్యాండ్ సిగ్నల్స్‌తో పాటు, ఈ ఉపగ్రహం ద్వారా పౌర సేవల కోసం ప్రత్యేకంగా ‘ఎల్1’ (L1) ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ను కూడా ప్రవేశపెట్టారు. ఈ సిగ్నల్ ద్వారా భారతదేశ భూభాగంతో పాటు సరిహద్దుల చుట్టూ సుమారు 1,500 కిలోమీటర్ల మేర స్పష్టమైన నావిగేషన్ సేవలు అందుతాయి. ముఖ్యంగా ఆధునిక స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్ పరికరాలు, జీపీఎస్ ఆధారిత సివిలియన్ డివైజ్‌లకు నావిక్ మరింత అనుకూలంగా మారనుంది.అంతరిక్ష రంగంలో విక్రమ్ సారాభాయ్ కల సాకారం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఇస్రో బృందాన్ని ప్రశంసించారు. "గత కొన్నేళ్లుగా ప్రధాని మోదీ తీసుకొచ్చిన విప్లవాత్మక అంతరిక్ష సంస్కరణల ద్వారా మన అంతరిక్ష పితామహులు విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్ కన్న కలలు సాకారమవుతున్నాయి. దేశీయ నావిగేషన్ వ్యవస్థను పటిష్టం చేయడంలో భారత్ ఎదుగుతున్న సామర్థ్యానికి ఇది నిదర్శనం. యావత్ భారతానికి ఇది గర్వకారణమైన క్షణం" అని ఆయన పేర్కొన్నారు.మరింత చదవండి

Source link