Last Updated:
Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 8కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా?
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య చెలరేగిన యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. అత్యధిక దేశాలు ముడి చమురు దిగుమతుల కోసం కీలకమైన హర్మూజ్ జలసంధిపైనే ఆధారపడటంతో, యుద్ధ ప్రభావం వల్ల క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. అయితే, ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు సడలడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ దిగివస్తున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర $78 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఆరంభంలో యుద్ధ భయాల కారణంగా పెరిగిన ఇంధన ధరలు, ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో స్థిరమైన స్థాయి వద్ద నిలిచాయి. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోనూ శనివారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పూ చోటుచేసుకోలేదు.

