ప్రభన్యూస్

Petrol Diesel Price: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! | బిజినెస్


Last Updated:

Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఏమైనా మార్పు జరిగిందా? కంపెనీలు రేట్లు పెంచాయా.. లేక ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయా? హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అక్టోబర్ 14న అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం క్రూడ్ ధరలు 90 డాలర్లు (బుధవారం ఉదయం 6 గంటల సమయంలో 94 డాలర్లు)పైనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలపై తాజాగా కేంద్రం నిర్ణయాలు తీసుకుందా?. కంపెనీలు రేట్లు పెంచాయా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి…. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. మరోవైపు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరల్లోనూ గత ఆగస్టుతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. అయితే అంతర్జాతీయ ముడిచమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ, రాష్ట్రాల పన్నుల్లో మార్పులు ఉంటే భవిష్యత్తులో ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అక్టోబర్ 14న హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69గా ఉండగా, డీజిల్ ధర రూ.103.82గా నమోదైంది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్‌కు రూ.116.39, డీజిల్ రూ.104.11గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.25 కాగా, డీజిల్ ధర రూ.104.96గా కొనసాగుతోంది. అంటే మూడు ప్రధాన నగరాల్లోనూ ఈరోజు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

సీఎన్‌జీ ధరలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో కిలోకు రూ.112.00, వరంగల్‌లో రూ.110.00, విశాఖపట్నంలో రూ.99.80, విజయవాడలో రూ.103.00గా ఉన్నాయి. గత ఆగస్టు నెలతో పోల్చినప్పుడు ఈ ధరల్లో కూడా మార్పు లేదని సమాచారం. వాహనదారులు పెట్రోల్, డీజిల్‌తో పాటు సీఎన్‌జీ ధరలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ విధానంలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. ఈ విధానం 2017 జూన్‌లో అమల్లోకి వచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ప్రకారం, రోజువారీ ధరల మార్పులు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఒక్కో నగరంలో వినియోగదారులు చెల్లించే తుది ధర ఒకేలా ఉండదు. స్థానిక పన్నులు, రవాణా వ్యయం, డీలర్ కమిషన్ వంటి అంశాల కారణంగా ప్రాంతాలను బట్టి ధరల్లో తేడాలు ఉండవచ్చు. ఒకే నగరంలోని వేర్వేరు ఇంధన కేంద్రాల్లో కూడా స్వల్పంగా ధర వ్యత్యాసం కనిపించే అవకాశం ఉందని ఇండియన్ ఆయిల్ పేర్కొంది.

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల మధ్య మారడానికి ప్రధాన కారణాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ముఖ్యంగా వ్యాట్, ఒకటి. వీటితో పాటు రవాణా ఖర్చులు, డీలర్ కమిషన్లు కూడా తుది ధరను ప్రభావితం చేస్తాయి. పెట్రోల్, డీజిల్ ప్రస్తుతం వస్తు సేవల పన్ను (GST) పరిధిలో లేవు. అందువల్ల రాష్ట్రాల పన్నుల విధానం ధరల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తోంది.

అంతర్జాతీయ ముడిచమురు ధరలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా భారత ఇంధన ధరలకు ముఖ్యమైన అంశాలు. భారత్ తన ముడిచమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతి చేసుకుంటున్నందున అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు, రూపాయి మారకం విలువలో మార్పులు ఇక్కడి ఇంధన వ్యయంపై ప్రభావం చూపుతాయి. సెప్టెంబర్‌లో భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ప్రపంచ చమురు ధరలు అధిక స్థాయిలో ఉండగా, ఇటీవలి రోజుల్లో వాటిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

గమనిక: మీ నగరంలోని ఇండియన్ ఆయిల్ బంకుల్లో అమలులో ఉన్న తాజా ధరలను మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం RSP <స్పేస్> డీలర్ కోడ్ టైప్ చేసి 92249 92249 నంబర్‌కు SMS పంపాలి. హైదరాబాద్‌కు 134483, విజయవాడకు 127611, విశాఖపట్నానికి 127290 డీలర్ కోడ్‌లను ఉపయోగించాలి. వెంటనే మీ ప్రాంతంలోని లైవ్ పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు మీ మొబైల్‌కు సందేశంగా అందుతాయి. దీంతో ప్రతి రోజు ఇంధన ధరలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 October 2026, 6:21 am Digital Edition : Prabhanews
Petrol Diesel Price: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! | బిజినెస్

Last Updated:Oct 14, 2026 6:16 AM ISTPetrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఏమైనా మార్పు జరిగిందా? కంపెనీలు రేట్లు పెంచాయా.. లేక ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయా? హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో అక్టోబర్ 14న అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.
ప్రతీకాత్మక చిత్రం ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం క్రూడ్ ధరలు 90 డాలర్లు (బుధవారం ఉదయం 6 గంటల సమయంలో 94 డాలర్లు)పైనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలపై తాజాగా కేంద్రం నిర్ణయాలు తీసుకుందా?. కంపెనీలు రేట్లు పెంచాయా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.... హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. మరోవైపు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరల్లోనూ గత ఆగస్టుతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. అయితే అంతర్జాతీయ ముడిచమురు ధరలు, రూపాయి-డాలర్ మారకం విలువ, రాష్ట్రాల పన్నుల్లో మార్పులు ఉంటే భవిష్యత్తులో ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.అక్టోబర్ 14న హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69గా ఉండగా, డీజిల్ ధర రూ.103.82గా నమోదైంది. విశాఖపట్నంలో పెట్రోల్ లీటర్‌కు రూ.116.39, డీజిల్ రూ.104.11గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.25 కాగా, డీజిల్ ధర రూ.104.96గా కొనసాగుతోంది. అంటే మూడు ప్రధాన నగరాల్లోనూ ఈరోజు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.సీఎన్‌జీ ధరలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో కిలోకు రూ.112.00, వరంగల్‌లో రూ.110.00, విశాఖపట్నంలో రూ.99.80, విజయవాడలో రూ.103.00గా ఉన్నాయి. గత ఆగస్టు నెలతో పోల్చినప్పుడు ఈ ధరల్లో కూడా మార్పు లేదని సమాచారం. వాహనదారులు పెట్రోల్, డీజిల్‌తో పాటు సీఎన్‌జీ ధరలను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు డైనమిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ విధానంలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడతాయి. ఈ విధానం 2017 జూన్‌లో అమల్లోకి వచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ప్రకారం, రోజువారీ ధరల మార్పులు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఒక్కో నగరంలో వినియోగదారులు చెల్లించే తుది ధర ఒకేలా ఉండదు. స్థానిక పన్నులు, రవాణా వ్యయం, డీలర్ కమిషన్ వంటి అంశాల కారణంగా ప్రాంతాలను బట్టి ధరల్లో తేడాలు ఉండవచ్చు. ఒకే నగరంలోని వేర్వేరు ఇంధన కేంద్రాల్లో కూడా స్వల్పంగా ధర వ్యత్యాసం కనిపించే అవకాశం ఉందని ఇండియన్ ఆయిల్ పేర్కొంది.పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల మధ్య మారడానికి ప్రధాన కారణాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ముఖ్యంగా వ్యాట్, ఒకటి. వీటితో పాటు రవాణా ఖర్చులు, డీలర్ కమిషన్లు కూడా తుది ధరను ప్రభావితం చేస్తాయి. పెట్రోల్, డీజిల్ ప్రస్తుతం వస్తు సేవల పన్ను (GST) పరిధిలో లేవు. అందువల్ల రాష్ట్రాల పన్నుల విధానం ధరల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తోంది.అంతర్జాతీయ ముడిచమురు ధరలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా భారత ఇంధన ధరలకు ముఖ్యమైన అంశాలు. భారత్ తన ముడిచమురు అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతి చేసుకుంటున్నందున అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు, రూపాయి మారకం విలువలో మార్పులు ఇక్కడి ఇంధన వ్యయంపై ప్రభావం చూపుతాయి. సెప్టెంబర్‌లో భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ప్రపంచ చమురు ధరలు అధిక స్థాయిలో ఉండగా, ఇటీవలి రోజుల్లో వాటిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.గమనిక: మీ నగరంలోని ఇండియన్ ఆయిల్ బంకుల్లో అమలులో ఉన్న తాజా ధరలను మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం RSP <స్పేస్> డీలర్ కోడ్ టైప్ చేసి 92249 92249 నంబర్‌కు SMS పంపాలి. హైదరాబాద్‌కు 134483, విజయవాడకు 127611, విశాఖపట్నానికి 127290 డీలర్ కోడ్‌లను ఉపయోగించాలి. వెంటనే మీ ప్రాంతంలోని లైవ్ పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు మీ మొబైల్‌కు సందేశంగా అందుతాయి. దీంతో ప్రతి రోజు ఇంధన ధరలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.మరింత చదవండి

Source link