ముఖ్యంగా వంట నూనెలు, మసాలా దినుసులు, బ్రెడ్, స్నాక్స్ వంటి ఆహార పదార్థాలను ఫ్రిజ్ పైన ఉంచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రిఫ్రిజిరేటర్ వెనుక లేదా పక్క భాగాల నుంచి వెలువడే వేడి, వంటగదిలోని ఉష్ణోగ్రత వంటివి ఈ వస్తువుల నాణ్యతపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పారదర్శక సీసాల్లోని నూనె వేడి, కాంతికి ఎక్కువగా గురైతే త్వరగా నాణ్యత కోల్పోయే అవకాశం ఉంది. మసాలా దినుసులు తమ సువాసనను కోల్పోవచ్చు. బ్రెడ్‌ను తేమ ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచితే బూజు పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల వీటిని చల్లగా, పొడిగా ఉండే తగిన ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.

