Last Updated:
Pension News | ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట లభించనుందా? పెరుగుతున్న జీవన వ్యయాలకు అనుగుణంగా కనీస పెన్షన్ పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని రాజ్యసభలో కీలక డిమాండ్ వచ్చింది.
ఈపీఎస్ పెన్షన్ తీసుకుంటున్న లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు అలర్ట్. కనీస పెన్షన్ పెంచడంతో పాటు పెన్షనర్ల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పీటీఐ కథనం ప్రకారం మంగళవారం రాజ్యసభలో స్పెషల్ మెన్షన్ ద్వారా ఈ అంశాన్ని ప్రస్తావించిన లక్ష్మణ్, ప్రస్తుతం చట్టబద్ధమైన కనీస పెన్షన్ రూ.1,000గానే ఉందని చెప్పారు. గత కొన్నేళ్లలో ఆహారం, మందులు, వైద్య ఖర్చులు భారీగా పెరిగాయని ఆయన గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఆయన, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

