Last Updated:
PCOD సమస్యతో బాధపడుతున్న మహిళలు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా లక్షణాలను నియంత్రించుకోవచ్చు. సమతుల్య ఆహారం, తగిన నిద్ర, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
మహిళల్లో ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న హార్మోన్ల, మెటబాలిక్ సమస్యల్లో పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ (PCOD) ఒకటి. అసమతుల్య జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటి అంశాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపుతాయని ఆయుర్వేద వైద్యుడు భార్గవ్ తన్నా తెలిపారు. దీంతో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

